ఎండ‌లు మండిపోతున్న క్ర‌మంలో ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాలి

 హైద‌రాబాద్ (praja amaravati): తెలంగాణ వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్న క్ర‌మంలో ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌


ని సంబంధిత అధికారుల‌కు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ఆదేశించారు. రీజిన‌ల్ మేనేజ‌ర్లు, డిపో మేనేజ‌ర్ల‌తో పాటు ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ఎండీ స‌జ్జ‌నార్ శుక్ర‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. బ‌స్టాండ్లు, బ‌స్ స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల‌కు సుర‌క్షిత‌మైన తాగునీటిని అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. మంచినీటితో పాటు ఫ్యాన్లు, ఎయిర్ కూల‌ర్లు, కూర్చొనేందుకు బెంచీలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ప్ర‌యాణికుల‌కు అన్ని ర‌కాల సేవ‌ల‌ను అందించాల‌ని చెప్పారు.


రాబోయే రోజుల్లో పెళ్లిళ్లు, ఇత‌ర ఫంక్ష‌న్లు అధికంగా ఉంటాయ‌ని స‌జ్జ‌నార్ తెలిపారు. మార్చి నెల‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీ అధికంగా ఉండే అవ‌కాశం ఉంది. ర‌ద్దీకి స‌రిప‌డా బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. కిరాయి బ‌స్సుల‌పై 10 శాతం రాయితీ ఇస్తున్న విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు. వివిధ బ‌స్సు స‌ర్వీసుల‌పై ఉన్న ఆఫ‌ర్ల‌ను కూడా ప్ర‌యాణికుల దృష్టికి తీసుకెళ్లాల‌ని స‌జ్జ‌నార్ సూచించారు.

Comments