అధికారంలోకి వచ్చిన తరువాత తప్పు చేసిన పోలీసులకు శిక్షతప్పదు

అనపర్తి (ప్రజా అమరావతి);


*అనపర్తిలో పంతం నెగ్గించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు*


*పోలీసుల అడ్డంకులను, ఆంక్షలను దాటుకుని వచ్చి అనపర్తి సభలో పాల్గొన్న టీడీపీ అధినేత*


*ప్రచార వాహనం రానివ్వకపోవడంతో అక్కడే ఉన్న ఓ వాహనం ఎక్కి మాట్లాడిన చంద్రబాబు నాయుడు*


*8 కిలోమీటర్ల దూరం కాలినడకన వచ్చి సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు*


*మైక్ తొలగించి, లైట్లు ఆపేసి, జనరేటర్ స్వాధీనం చేసుకుని  పలు రకాలుగా ఇబ్బందులు సృష్టించిన పోలీసులు*


*చంద్రబాబు కాన్వాయ్ ముందు పోలీస్ సిబ్బందిని కూర్చోబెట్టిన వాహనాలు వెళ్ళకుండా అడ్డంకులు సృష్టించిన పోలీసుల అధికారులు*


*క్యాడర్, ప్రజల సహకారంతో అడ్డంకులు దాటుకుని అనపర్తిలో సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు*.


*ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన చంద్రబాబు నాయుడు*.


*సభలో చంద్రబాబు ప్రసంగం:-*


అనపర్తి వస్తుంటే ఈ సైకో సిఎం అడ్డుకున్నాడు.

సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు ఇప్పుడు అనుమతి లేదు అంటున్నారు

పోలీసులు ఇచ్చిన ఈ అనుమతి పత్రంపై ఏం సమాధానం చెపుతారు

స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో సహాయ నిరాకరణ ఉద్యమం నడిచింది. నాడు గాంధీ బ్రిటీష్ అదేశాలను ధిక్కరించి దండి మార్చ్ చేశారు.

నేను ఈ రోజు ఈ ప్రభుత్వ అసంబద్ద నిర్ణయాలను వ్యతిరేకించి అనపర్తి మార్చ్ చేశాను.

నేను సిఎంగా ఉన్నప్పుడు వైఎస్ ఆర్ పాదయాత్ర చేశాడు..నేను సహకరించాను

నేను సిఎంగా ఉన్నప్పుడే జగన్ పాదయాత్ర చేశాడు..నేను ఆరోజు అడ్డుకున్నానా?

సైకోకు బుద్ది లేకపోతే కనీసం పోలీసులకు అయినా బుద్ది ఉండాలి కదా!

అధికారంలోకి వచ్చిన తరువాత తప్పు చేసిన పోలీసులకు శిక్షతప్పదు


ఎందుకు పోలీసులు ఇంత దారుణంగా దిగజారి వ్యవహరిస్తున్నారు. పోలీసుల తీరుతో ఖాకీ దుస్తులే సిగ్గు పడుతున్నాయి

14 ఏళ్లు సిఎంగా ఉన్న నా పట్ల చాలా దారుణంగా వ్యవహరించారు. ఎన్నొ అవమానాలు ఎదుర్కొన్నా.

జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది...రాష్ట్రాన్ని దోచుకుంటున్న దొంగ. జగన్ కు ధన దాహం

కోడికత్తి డ్రామాలు ఆడే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. కోడి కత్తి డ్రామాలో జగన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.

జగన్ స్టిక్కర్ సిఎం. భూమి మీది...బొమ్మ జగన్ ది

పట్టా పుస్తకం మీది...బొమ్మ జగన్ ది

జగన్ పాలనలో రైతాంగం దెబ్బతిన్నారు....ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు

పాడేరులో ఒక పాప చనిపోతే....130 కిలోమీటర్లు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనం పై మృతదేహాన్ని తీసుకువెళ్లారు. వ్యవస్థల నాశనానికి ఇదొక ఉదాహరణ

ఈ సమస్యలు అన్నీ పోవాలి అంటే సైకో పోవాలి...సైకిల్ రావాలి

తెల్ల రేషన్ కార్డులు పథకాలకు అర్హత కాదని వాటినీ తీసేస్తున్నాడు

నేను పాకిస్థాన్ నుంచి వచ్చానా.. ఎందుకు అడ్డుకుంటున్నారు?  ఎన్నో అవమానాలు భరించి ఇక్కడకు వచ్చా 

జగ్గంపేట, పెద్దాపురం పోలీసులు నాకు సహకరించారు 

ఖబడ్దార్.. గ్రావెల్ సూర్యనారాయణ.. జాగ్రత్తగా ఉండు.

భావితరాల భవిష్యత్తు కోసమే నేను పనిచేస్తున్నా

ఈ సైకో సీఎం.. పోలీసుల మెడపై కత్తిపెట్టారు 

ఇదే యూనిఫామ్‌లో రేపు నా దగ్గర పని చేయాలని గుర్తుపెట్టుకోండి

పోలీసులు కూడా సంఘ విద్రోహులా మారారు

ఎవరైనా నా మైక్ దగ్గరకు వస్తే ఖబడ్దార్

చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడ్డ పోలీసులను బొక్కలో పెడతా

అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది

జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది ..జగన్ ఏం చేసినా స్కాం ఉంటుంది

ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలికిపాటు ఎందుకు? 

టీడీపీ కార్యకర్తలను కొట్టడం పోలీసులకు మంచిది కాదు

సీఎం కావాలని నేను పోరాటం చేయడం లేదు. 

వైసీపీ పరిపాలనలో అన్ని పన్నులు పెరిగాయి 

సైకో పాలన వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది

ధాన్యం కొనాలని అడిగిన రైతులపై కేసులు పెడుతున్నారు

జగన్.. రైతు వ్యతిరేకి... వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆక్వా రంగాన్ని బాగా దెబ్బతీసింది

మేం వచ్చాక ఆక్వా రైతులకు రూ.1.5కే కరెంట్ ఇస్తాం

అనపర్తి లో టీడీపీ హయాంలో రూ. 700 కోట్ల రూపాయల అభివృద్ది జరిగింది.

ఎమ్మెల్యే గ్రావెల్ అక్రమాలతో గ్రావెల్ కింగ్ లా మారాడు.

Comments