వైఎస్సార్ లా నేస్తం పథకం కింద చెక్కు పంపిణీ

 *వైఎస్సార్ లా నేస్తం పథకం కింద చెక్కు పంపిణీ


*


*: జిల్లాలో 20 మంది లబ్ధిదారులకు రూ.15.35 లక్షల లబ్ధి*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఫిబ్రవరి 21 (ప్రజా అమరావతి): 


*పుట్టపర్తి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం వైఎస్సార్ లా నేస్తం పథకం - 2022 కింద అర్హులైన లబ్ధిదారులకు డిఆర్డీఏ పిడి నరసయ్య మెగా చెక్ ను పంపిణీ చేశారు. జిల్లాలో అర్హులైన 20 మంది అర్హులైన యువ న్యాయవాదులకు 15,35,000 రూపాయల నగదు మంజూరు కాగా, పంపిణీ చేయడం జరిగింది.*


*ఈ సందర్భంగా డిఆర్డీఏ పిడి నరసయ్య మాట్లాడుతూ కొత్తగా న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన యువ న్యాయవాదులకు, వారి వృత్తిలో స్థిరపడే వరకు మొదటి మూడు సంవత్సరాలపాటు నెలకు 5,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. వైఎస్సార్ లా నేస్తం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని, 35 ఏళ్ల లోపు వయస్సు మరియు తొలి మూడేళ్ల ప్రాక్టీస్ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డివిజనల్ అభివృద్ధి అధికారి శివారెడ్డి, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.*


*1. ప్రభుత్వ ప్రోత్సాహం ఎనలేనిది*

*: జె.కావ్యశ్రీ, వైఎస్సార్ లా నేస్తం పథకం లబ్ధిదారురాలు, గూనిపల్లి గ్రామం, బుక్కపట్నం మండలం, శ్రీ సత్య సాయి జిల్లా.*


అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో నేను లా చదివాను. యువ న్యాయవాదిగా ప్రాక్టీస్ కి వెళుతున్నాను. నాకు మొదటిసారి లానేస్తం పథకం కింద 5 వేల రూపాయల ఆర్థిక సహాయం పొందడం జరిగింది. యువ న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎనలేనిది. పేద కుటుంబాల్లోనీ యువ న్యాయవాదులు వృత్తిలో ఎదిగేందుకు వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా అర్హులకు నెలకు రూ.5000 లు అందించడం ఎంతో సంతోషంగా ఉంది.


*2. చాలా సంతోషంగా ఉంది*

*: శివశంకర్, వైఎస్సార్ లా నేస్తం పథకం లబ్ధిదారుడు, హిందూపురం, శ్రీ సత్య సాయి జిల్లా.*


నేను శ్రీకాకుళంలోని అంబేద్కర్ యూనివర్సిటీలో లా చదవడం జరిగింది. హిందూపురంలో యువ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు మొదటిసారి లా నేస్తం కింద 5 వేల రూపాయల ఆర్థిక సహాయం పొందడం జరిగింది. యువ న్యాయవాదుల అవసరాలు తీర్చుకునేందుకు  ప్రతినెల ఆర్థిక సహాయాన్ని అందజేసి  ఆదుకుంటున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. న్యాయవాదుల సంక్షేమం కోసం కార్పస్ ఫండ్ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయం.



Comments