నపుంసక చర్యలకు వంశి పాల్పడటం సిగ్గు చేటు ? - కొల్లు రవీంద్ర

 ఖండన


*నపుంసక చర్యలకు వంశి పాల్పడటం సిగ్గు చేటు ? - కొల్లు రవీంద్ర*మచిలీపట్టణం (ప్రజా అమరావతి): కృష్ణ జిల్లా గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై  ఏమ్మెల్యే వంశి వర్గీయులు  దాడి చేయడాన్ని నపుంసక చర్యగా భవిస్తూన్నామని కొల్లు రవీంద్ర ఖండన ఇవ్వడం జరిగింది.  వంశి లాంటి ఎమ్మెల్యే లు ప్రజాస్వామ్య బద్దంగా పోరాడి రాజకీయాల్లో ముందుకెళుతారు అనుకున్నాను, కానీ ఈ వంశి పార్టీ కార్యాలయంపై దాడికి తెగబడటాన్ని చూస్తే అతనిలో ఎంత పిరికిపంద దాగివున్నాడో అర్థమవుతోందని ఎద్దేవా చేసాడు.  తెలుగుదేశం పార్టీలో ఉన్నత వరకు వంశి ఒక మగాడిలా రాజాకీలు చేయడాన్ని చూసాను కానీ వైసీపీ పార్టీలోకి చేరి జగన్ సాంగత్యం వళ్ళ వంశి కూడా ఇలా మారిపోయి ఒక పోలీస్ కంప్లైంయెంట్ కె భయపడి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేస్తున్నాడంటే అతని భవిష్యత్తు అతనికి అర్తమయింది అని అనుకుంటున్నా.  రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత అతను వుంచిన దానికన్నా ఎక్కువ అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము గుర్తుపెట్టు కోవాలని హితవు పలుకుతున్న అన్నారు.   అంతే కాదు జగన్ సైకో పాలనకు ఇది ప్రత్యక్ష నిదర్శనం కూడా అన్నారు.  అందుకే చంద్రబాబు గారు సైకో పోవాలి సైకిల్ రావాలి అని చెబుతున్నారు.  ఇప్పటికైనా విజ్ఞులైన ప్రజలు ఈ రాక్షశ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.  మీ రాక్షశ ఆలోచనలే తెలుగుదేశానికి విజయ సోపానాలని తెలిపారు.  ఈ ఘటనతో వైసీపీ ప్రభుత్వం ప్రస్ట్రేషన్ బయటకు వస్తుంది.  పూర్తిగా వైసీపీ ప్రభుత్వం పతన దశకు చేరుకుంది.   ఒక్క క్షణం కూడా జగన్ ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు..   ఈ ఘటనకు పాల్పడినవారిపై తక్షణమే చట్టపరమైన చెర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో ఈ రాక్షస ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడయం ఖాయం అని కొల్లు రవీంద్ర  తీవ్రంగా హెచ్చరించారు.

Comments