ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా (ప్రజా అమరావతి);
*ఏపీలో విద్యా సంస్కరణలు భేష్
*
*** పాఠశాలలను సందర్శించిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు
***విద్యా పథకాలను వివరించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ & ఎస్పీడీ శ్రీ ఎస్. సురేష్ కుమార్
‘విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంస్కరణలు ఎంతో స్ఫూర్తిదాయకమని, తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు పనికొస్తాయని, ఏపీ విద్యా సంస్కరణలు భేష్’ అని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసల జల్లులు కురిపించారు.
*పాఠశాలలను సందర్శించిన ప్రతినిధులు..*
విద్యారంగంలో పనిచేస్తున్న అనేక ప్రఖ్యాత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, IAS అధికారులు ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులు ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాల్లోని కొన్ని పాఠశాలలను సందర్శించి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సంభాషించారు.
కృష్ణా జిల్లాలో కోలవెన్ను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పునాదిపాడు, ఈడుపుగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎన్టీఆర్ జిల్లాలోని పటమట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యారంగ ప్రముఖులు.. రతీ ఫోర్బ్స్ ( డైరెక్టర్ ఫోర్బ్స్ మార్షల్ లిమిటెడ్), వివేక్ రాఘవన్ ( ట్రస్టీ, ఆర్జీ మనుధనే ఫౌండేషన్ CEO & ప్రెసిడెంట్, ఎయిర్‌వైన్ సైంటిఫిక్), నీలేష్ నిమ్కర్ (ఫౌండర్ ట్రస్టీ, క్వెస్ట్), కవితా ఆనంద్ (విద్యాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు), మురుగన్ వాసుదేవెన్ (CEO, లెట్స్ డ్రీమ్ ఫౌండేషన్, మాజీ-హెడ్, సోషల్ ఇన్నోవేషన్, CISCO ఇండియా మరియు దక్షిణాసియా.), మినాల్ కరణ్వాల్ (సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ITDP) ప్రాజెక్ట్ ఆఫీసర్, నందుర్‌బార్, మహారాష్ట్ర), ఆకాంక్ష గులాటి ( డైరెక్టర్, యాక్ట్ గ్రాంట్స్), ప్రాచీ విన్లాస్ (మైఖేల్ సుసాన్ డెల్ ఫౌండేషన్, డైరెక్టర్, ఇండియా), తరుణ్ చెరుకూరి( CEO, ఇండస్ యాక్షన్), స్నేహ మీనన్(క్యాటలిటిక్ ఫిలాంత్రోపీ, దస్రా) బృందం సందర్శించారు.
*ఇవీ అమలవుతున్న విద్యాపథకాలు*
ఈ సందర్భంగా అతిథులతో నిర్వహించిన చర్చాగోష్ఠి కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు పాల్గొని, ఈ బృందానికి గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న అమ్మఒడి’, ‘మన బడి: నాడు- నేడు’, ‘జగనన్న విద్యాకానుక’, ‘జగనన్న గోరుముద్ద’ వంటి పథకాల గురించి విశ్లేషించారు.
అలానే ‘స్కూల్ మెయింటెన్స్ ఫండ్’, ‘టాయిలెట్ మెయింటెన్స్ ఫండ్’ డిజిటల్ విద్య గురించి విశ్లేషిస్తూ ‘తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెళ్లు’, ‘8 తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబులు పంపిణీ’, ‘ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు’, ‘అటల్ టింకరింగ్ ల్యాబ్ స్టేట్ హబ్, ట్రైనింగ్ సెంటర్’, ‘విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాల నేర్పించేందకు శిక్షణా తరగతులు’, జాతీయ నూతన విద్యావిధానం ప్రకారం ఆరంచెల పాఠశాల విద్యావిధానం’, ఐఐఎంఎ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఉపాధ్యాయులకు ఉత్తమ శిక్షణ అందించడం వంటి కార్యక్రమాల గురించి వివరించారు.
మొత్తం విద్యా వ్యవస్థను సమగ్రంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అపూర్వమైనదని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అయితే అనేక రాష్ట్రాలు కొన్ని పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిలో కొన్ని కార్యక్రమాలు చేశాయని, ఆంధ్రప్రదేశ్‌లో సంస్కరణలు మొత్తం విద్యా విలువ తరగతులను కవర్ చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యా సంస్కరణలకు కేంద్రంగా రాష్ట్రాన్ని నిలపడంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి దార్శనికతను మెచ్చుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు.
*మేమూ అమలు చేస్తాం*
తాము సందర్శించిన పాఠశాలలు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రతినిధులు ముక్తకంఠంతో అన్నారు. పాఠశాలల్లో చురుగ్గా ఉన్న పరిశుభ్రత, సంతోషకరమైన అభ్యాస వాతావరణం, మౌలిక సదుపాయాలు మరియు డిజిటల్ గవర్నెన్స్ కార్యక్రమాలను, అలాగే ఉపాధ్యాయులు అందించిన సృజనాత్మక సూచనలను మెచ్చుకున్నారు. ప్రధానోపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, టీచర్ మెంటార్‌లు వినియోగిస్తున్న ‘టీచ్ టూల్’, బోధన-అభ్యాస పద్ధతుల, నాణ్యతను అర్థం చేసుకోవడానికి మెరుగుపరచడానికి విద్యా శాఖ రూపొందించిన కొత్త యాప్ లు తమ రాష్ట్రాల్లో అమలు చేసుకోవడానికి పనికొస్తాయని అన్నారు.
addComments
Post a Comment