శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):
మహా శివరాత్రి పర్వదినం సందర్భముగా ది. 18-02-2023, 19-02-2023 రోజులలో శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయము నందు స్వామీ వారి దర్శనం కల్పించనున్న సందర్భముగా ఈరోజు అనగా ది.16-02-2023 న ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ కర్నాటి రాంబాబు , ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ళ భ్రమరాంబ , పాలకమండలి సభ్యులు మరియు వైదిక కమిటీ సభ్యులు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయము వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న క్యూ –లైన్, లైటింగ్, శానిటేషన్ తదితర పనులను పరిశీలించారు. సదరు పనుల గురించి ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీ కే.వి.ఎస్ కోటేశ్వర రావు మరియు ఇంజినీరింగ్ సిబ్బంది వీరికి వివరించారు. అనంతరం భక్తులు కొబ్బరి కాయలు సమర్పించుకొను ప్రదేశము, ఉచిత ప్రసాద పంపిణీ, బాలాలయము, కొండపైన పాత పొంగల్ షెడ్డు, తదితరములు పరిశీలించారు. ఉచిత ప్రసాద పంపిణీ వద్ద వీరు భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఉచిత ప్రసాద ఏర్పాట్లపై భక్తులు సంతృప్తిని వ్యక్తపరిచారు. అనంతరం ఎటువంటి ఫిర్యాదులు లేకుండా భక్తులతో సమన్వయంతో నడుచుకొనవలసినదిగా సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమములో పాలకమండలి సభ్యులు కట్టా సత్తయ్య , నంబూరి రవి , వైదిక కమిటీ సభ్యులు శ్రీ ఆర్.శ్రీనివాస శాస్త్రి , కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీ కే.వి.ఎస్ కోటేశ్వర రావు , సహాయ కార్యనిర్వాహణాధికారి వార్లు ఎన్.రమేష్ , బి.వెంకటరెడ్డి మరియు ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment