ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు.

 *- ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు


 *- రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం* 

 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు* 

 *- ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనూహ్య స్పందన*

 *- అనమనపూడిలో గ్రామస్తులతో కలిసి రచ్చబండ*



నందివాడ /గుడివాడ, ఫిబ్రవరి 22 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించే ప్రతిపక్షాలపై దాడులకు దిగుతున్నారని కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ  తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నందివాడ మండలం అనమనపూడి గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమం జరిగింది. గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ప్రభుత్వ అసమర్థ పాలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడులకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కంప్యూటర్లు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారన్నారు. టిడిపి నేతల వాహనాలను తగలబెట్టారన్నారు. పార్టీ నేతల ఇళ్లపై, కార్యకర్తలపై దాడులకు దిగారని, ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. ఈ ఘటనను టిడిపి అధినేత చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారని, రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖను కూడా విడుదల చేశారన్నారు. చంద్రబాబు ఆదేశాలతో తాను స్వయంగా గన్నవరం వెళ్లి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన టిడిపి నేతలతో మాట్లాడానని, పార్టీ అండగా ఉంటుందని తెలిపానన్నారు. అనపర్తిలో చంద్రబాబు నిర్వహించిన సభ విజయవంతమైందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు ఎండగట్టారన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలన్న ఉద్దేశంతోనే గన్నవరం ఘటనకు పాల్పడ్డారన్నారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయన వెంటనే రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రావి చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నందివాడ మండల అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

Comments