స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి బుధవారం నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.


 

నెల్లూరు, ఫిబ్రవరి 22 (ప్రజా అమరావతి): 

ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి బుధవారం నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వైయస్సార్సీపి అభ్యర్థిగా మేరిగ మురళీధర్ మూడు సెట్ల నామినేషన్ పత్రాలను కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్రీ రోణంకి కూర్మనాథ్ కు అందజేశారు. అలాగే పెళ్లకూరు మండలం బంగారం పేట సర్పంచ్ దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. వైఎస్ఆర్సిపి అభ్యర్థి శ్రీ మేరిగ మురళీధర్  వెంట రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, శ్రీ గురుమూర్తి,  జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, ఆత్మకూరు శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రంరెడ్డి ఉన్నారు. ఈనెల 23తో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది. 

Comments