ఎపి పోలీస్ దిశ యాప్ , SOS బటన్ పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ ఉప రాష్ట్రపతి.

 

విశాఖపట్నం సిటీ (ప్రజా అమరావతి);*ఎపి పోలీస్ దిశ యాప్ , SOS బటన్ పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ ఉప రాష్ట్రపతి* 


జాతీయ స్థాయి మహిళా సదస్సు  చివరి రోజు కార్యాక్రమంలో పాల్గొన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు 


సదస్సు వద్ద ఎపి పోలీసులు ఏర్పాటు చేసిన దిశ స్టాల్ ని సందర్శించి ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ అందిస్తున్న సేవలు , SOS బటన్ పనితీరు పట్ల  హర్షం తెలియజేశారు.


         *NCW (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్) చైర్మన్ శ్రీమతి రేఖా శర్మ తో పాటు సదస్సులో పాల్గొన్న ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రజా ప్రతినిధులకు* దిశ యాప్ ప్రాముఖ్యత, SOS బటన్ పనితీరు పట్ల మహిళలకు ఉన్న భరోసా ను వీడియో ద్వారా వివరించిన ఎపి మంత్రి ఉషాశ్రీ చరణ్, ఎమ్మెల్యే రెడ్డి శాంతి.


      "she is a change maker" Project లో భాగంగా 11 రాష్ట్రాలకు చెందిన 50 మండి మహిళా ఎమ్మెల్యేలతో విశాఖపట్నంలో జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కొనసాగుతున్న మహిళా ఎమ్మెల్యేల సదస్సులో మహిళా రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ ప్రారంభించిన దిశ సంభందిత కార్యాక్రమాలను వివరిస్తూ విశాఖపట్నం సిటి పోలీసులు ఏర్పాటు చేసిన దిశ స్టాల్ మహిళా ప్రతినిధులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దిశ అప్లికేషన్ డౌన్లోడ్ , రిజిస్ట్రేషన్ ,SOS  పనితీరును వివరిస్తూ ఏర్పాటు చేసిన ఈ స్టాల్ ను తిలకించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో మహిళాల రక్షణ కోసం ప్రభుత్వం  ప్రవేశ పెట్టిన  అప్లికేషన్ కు అత్యంత స్వల్ప వ్యవధిలో 1,11,39,456  మంది తమ సెల్ ఫోన్ నెంబర్ ను రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే మహిళాల రక్షణ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఏపీ పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు చాలా గొప్పగా ఉన్నాయి అని అభినందిస్తున్న వివిధ రాష్ట్రాల కు చెందిన మహిళా ఎమ్మెల్యేలు. Comments