జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను ఆదివారం తనిఖీ చేసి ఈనెల 13వ తేదీన పోలింగ్ కు సిద్ధం చేయాలినెల్లూరు, మార్చి 4 (ప్రజా అమరావతి);


 జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను ఆదివారం తనిఖీ చేసి ఈనెల 13వ తేదీన పోలింగ్ కు సిద్ధం చేయాల


ని జిల్లా కలెక్టర్  శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.


శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి ఎన్నికల అధికారులు, జిల్లా అధికారులు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో  పోలింగ్ ఏర్పాట్లు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు,  వేసవి వడగాలులు తదితర అంశాలపై  టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం  మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు, నీడ,  మరుగుదొడ్లు, మంచినీరు,  తదితర వసతులు అన్ని అందుబాటులో ఉండాలన్నారు.  జిల్లాలోని 169 పోలింగ్ కేంద్రాలను సెక్టోరల్ అధికారులు ఆదివారం తనిఖీ చేసి అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈనెల 13వ తేదీన జరిగే పోలింగ్ కు సిద్ధం చేయాలన్నారు. ఈనెల 6 వ తేదీన సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. 


 భారత ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు  జారీ చేసే సూచనలను తప్పనిసరిగా అనుసరించాలన్నారు.


 పోలింగ్ సిబ్బంది, సామాగ్రిని తరలించేందుకు అవసరమైన  మేరకు బస్సులను ప్రజా రవాణా శాఖ సమకూర్చాలన్నారు.


పోలింగ్ సిబ్బందికి కావలసిన భోజనం, మంచినీరు తదితర సౌకర్యాలను పోలింగ్ పంపిణీ కేంద్రము, స్వీకరణ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. 


పోలింగ్కు అవసరమైన సామాగ్రి,  బ్యాలెట్  పెట్టెలను సిద్ధం చేసుకోవాలన్నారు.జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వడగాలులు వీచే అవకాశం ఉన్నందున వడదెబ్బ తగలకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.


అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆసుపత్రులలో మంచినీరు ఓఆర్ఎస్ మజ్జిగ ప్యాకెట్లు  అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు.


ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాలలో కూలీల కోసం మంచినీరు, నీడ పట్టలను ఏర్పాటు చేయాలన్నారు. 


 ఈనెల 22వ తేదీ ఉగాది నాటికి  నిర్ణీత లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమంపై ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పూర్తి చేయాలన్నారు


ఈ టెలీ కాన్ఫరెన్స్లో  సంయుక్త కలెక్టర్ శ్రీ రోనంకి కూర్మనాధ్, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మ పలువురు ఎన్నికల అధికారులు,  ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు,  పాల్గొన్నారు


Comments