నెల్లూరు మార్చి 9 (ప్రజా అమరావతి);
ఈ నెల 15 నుండి ఏప్రిల్ 4 వరకు జరుగబోవు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ కు పకడ్బందీగా ఏర్పాట్లు
పూర్తిచేసినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కుర్మనాధ్ తెలిపారు.
గురువారం సాయంత్రం జేసి చాంబర్ లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సన్నాహాక సమావేశం నిర్వహించారు. తోలుత ఇంటర్మీడియట్ పరీక్ష ఏర్పాట్ల పై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి టి. వర ప్రసాద్ రావు వివరించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 52903 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారన్నారు. ఇందుకోసం జిల్లాలో 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా 4 ఫ్లయింగ్ స్కాడ్ లను, 5 సిటింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేసామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలోని అన్ని రూములలో సి సి కెమెరాలు ఏర్పాటు చేసామన్నారు. కంట్రోల్ రూమ్ నుండి పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సరిపోవు పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయవలసిందిగా పోలీస్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం జ్వరాలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రతి పరీక్ష కేంద్రం లో తప్పనిసరిగా ప్రధమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా వైద్య శాఖాధికారులకు సూచించారు. పరీక్షలు జరుగు ప్రదేశాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కు చర్యలు తీసుకోవలసిందిగా విద్యుత్ శాఖాధికారులకు సూచించారు. అవసరమైన రూట్లలో ప్రత్యేకంగా ఆర్ టి సి బస్ సర్వీసులు ఏర్పాటు చేయవలసిందిగా ఆర్ టి సి అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డి ఎస్ పి గాంధీ, నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యుటీ కమీషనర్ చెన్నుడు, ఆర్ టి సి డిపో మేనేజర్ శివకేష్, ప్రిన్సిపాల్స్ వేణుగోపాల్, దీనదయాళ్, వెంకటేశ్వర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment