ఈనెల 18న 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వాకిన్ ఇంటర్వ్యూ

 ఏపీ వైద్య ఆరోగ్య శాఖ


విజయవాడ (ప్రజా అమరావతి); *ఈనెల 18న 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో

వాకిన్ ఇంటర్వ్యూ


*


*సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ*

*డిఎంఇ డాక్టర్ వి.వినోద్ కుమార్*


సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఈనెల18న  5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ  నిర్వహించనున్నట్లు వైద్య విద్యా సంచాలకులు(డిఎంఇ)

డాక్టర్ వి. వినోద్ కుమార్ IAS నేడొక ప్రకటనలో తెలిపారు.

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డిఎంఇ) గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం  5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నట్లు  ఆయన పేర్కొన్నారు.

 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులకు ప్రిన్సి పాల్ కార్యాలయం నందు వాక్ ఇన్ ఇంటర్వూలు నిర్వహిస్తారన్నారు.

విజయనగరం,

రాజమహేంద్రవరం,

ఏలూరు,

మచిలీపట్నం,

నంద్యాల

కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారన్నారు.

జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, OBG, అనస్థీషియా, పెడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, అఫ్తాల్మొలజీ , ఈఎన్టి,  రేడియాలజీ, యమర్జెన్సీ మెడిసిన్, అనాటమీ, ఫీజీయోలజీ,  బయో-కెమిస్ట్రీ, ఫార్మ కాలజీ, మైక్రో బయాలజీ, పాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, SPM విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తామని వినోద్ కుమార్ వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు  

ఎస్ ఎస్ సి, 

ఎమ్.బి.బీ.ఎస్,  

పీజీ, డిగ్రీ సర్టిఫికెట్స్,

మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,

పీజీ మార్కుల లిస్టు, 

సోషల్ స్టేటస్ సర్టిఫికెట్,  

ఆధార్ కార్డు, 

4వ తరగతి నుండి 10 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్ లతో 

ఇంటర్వ్యూ కి హాజరు కావాలని  ఆయన తెలిపారు.

Comments