సత్యసాయిజిల్లా, పెనుగొండ నియోజకవర్గం, పెనుకొండ ఎన్-గ్రాండ్ కన్వెన్షన్ హాల్ లో బోయ,కురుబ సామాజికవర్గంతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి...
యువనేత నారా లోకేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ....
పెనుకొండ (ప్రజా అమరావతి);
• బీసీలకు నిజమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్య్రం వచ్చింది 1983లో.
• స్థానిక సంస్థల్లో బీసీలకు 20శాతం ఎన్టీఆర్ ఇచ్చారు. దాన్ని 34శాతం చేసింది చంద్రబాబు.
• ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు బీసీలకు అత్యధికంగా ఇచ్చిన ఘనత టీడీపీది.
• బీసీ సాధికార సమితులతో బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.
• టీడీపీ పాలనలో బోయ కార్పొరేషన్ కు సంవత్సరానికి రూ.300కోట్లు చొప్పున కేటాయించి ఖర్చు చేశాం.
• బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం.
• కేంద్రం ఇటీవల 15కులాలను ఎస్టీ జాబితాలో చేర్చింది. కానీ ఏపీ ప్రభుత్వం కనీసం మన రాష్ట్రంలోని కొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు నోరెత్తలేదు.
• వైసీపీ ప్రభుత్వం బోయ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వకుండా ద్రోహం చేసింది.
• కార్పొరేషన్ చైర్మన్ కు కనీసం కుర్చీకూడా ఇచ్చిన దాఖలాలు లేవు.
• టీడీపీ పాలనలో మేం వివిధ సామాజికవర్గాలకు ఎంత ఖర్చుపెట్టామో, వైసీపీ ఎంత ఖర్చుపెట్టిందో బహిరంగ చర్చకు రావాలని పాదయాత్ర ప్రారంభం నుండి సవాల్ విసురుతూనే ఉన్నా. ఎవరూ అంగీకరించి ముందుకు రావడం లేదు.
• కురుబ కమ్యూనిటీ భవనాలు కట్టేందుకు ఉమ్మడి అనంతపురంజిల్లాకు రూ.10కోట్లు కేటాయించాం. భవనాలు 90శాతం పూర్తిచేశాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక మిగిలిన 10శాతాన్ని పూర్తిచేయకుండా వదిలేశారు.
• కురుబలకు గొర్రెల యూనిట్లు ఇచ్చి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాం.
• కురుబ ఫెడరేషన్ ను 2017లో ఏర్పాటు చేసి మొదటి సంవత్సరమే రూ.300కోట్లు ఖర్చు చేశాం.
• ఉమ్మడి అనంతపురంజిల్లాలో గొర్రెలు కొనేందుకు రూ.25కోట్లు ఖర్చుపెట్టాం.
• రూ.4లక్షల లోన్లలో 50శాతం సబ్సిడీలు ఇచ్చాం.
• కురుబ కార్పొరేషన్ కు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
• గతంలో ఎన్నడూ లేనివిధంగా బీసీలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. ఇప్పటి వరకు 26వేల అక్రమ కేసులు పెట్టారు.
• బీసీలను రక్షించేందుకు బీసీ అట్రాసిటీ చట్టం తెస్తాం. మానిటరింగ్ కమిటీలు జిల్లా స్థాయిల్లో నియమిస్తాం. పటిష్టంగా చట్టాన్ని అమలు చేస్తాం.
ముఖాముఖిలో ప్రశ్న-జవాబులు:
రమణ: మా జిల్లాలో బోయ,కురుబలకు రాజకీయ భద్రత కల్పించాలి.
లోకేష్: రానున్న కాలంలో చట్టసభల్లో బోయ, కురుబలకు రాజకీయంగా పెద్దపీట వేస్తాం.
రాజు: వాల్మీకీ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి.
లోకేష్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించే అంశంపై టీడీపీ కేంద్రంతో మాట్లాడింది. అధికారంలోకి వచ్చాక ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటాం.
గిరి: కురుబలు బీసీ-బీ కేటగిరీలో ఉంది. రిజర్వేషన్ పరంగా పోటీ ఎక్కువగా ఉంది. బీసీ-బీ నుండి వేరే కేటగిరీలోకి మార్చాలి.
లోకేష్: ఈ విషయాన్ని బీసీ కమిషన్ పరిశీలిస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. కురుబలకు అవకాశాలు తగ్గుతున్నాయంటే దానికి కారణం జగన్ రెడ్డి. కురుబలు ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయి గురించి ఆలోచించాలి.
బాలకృష్ణ: మేం వాల్మీకీ సామాజికవర్గం. మీరు అధికారంలోకి వచ్చాక మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు?
లోకేష్: వాల్మీకీలకు కార్పొరేషన్ పెట్టి, నిధులు కేటాయించి, ఖర్చు చేసింది చంద్రబాబు. మేం అధికారంలోకి వచ్చాక గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తాం. జగన్ రెడ్డి పాలనలో వాల్మీకీలు తీవ్రంగా మోసపోయారు.
నాగేంద్ర: మేం కురుబ సామాజికవర్గం. అమరావతి రాజధానిలో మాకులదైవం కనకదాసు దేవాలయం నిర్మించాలి. మాకు గొర్రెల యూనిట్లు ఇవ్వాలి. వీరప్పగారి దేవాలయాలు నిర్మించాలి.
లోకేష్: కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం. గతంలోనే నేను హామీ ఇచ్చి ఉన్నాను. వీరప్పగారి దేవాలయం నిర్మాణం, అందులో అర్చకుల నియామకానికి ప్రభుత్వ నిధులు కేటాయిస్తాం.
రామప్ప: వాల్మీకీ, బోయల్లో చదువుకున్న యువతకు రాజకీయ పదవులు కేటాయించాలి.
లోకేష్: పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం ఇస్తాం. సీనియర్, జూనియర్ అనే బేధాలు నేను చూడను. రాజకీయంగా పైకి రావాలనుకునే వారు క్షేత్రస్థాయిలో కష్టపడాలి.
ఆంజనేయులు: వాల్మీకీ బోయల్ని కేవలం 4జిల్లాల వారినే ఎస్టీ జాబితాలో చేరుస్తారా? రాష్ట్రమంతా చేస్తారా?
లోకేష్: ఎస్టీల ప్రయోజనాలు దెబ్బతినకుండా వాల్మీకీ, బోయల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తాం. కొంత మంది కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. టీడీపీ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎట్టిపరిస్థితుల్లో మారదని గుర్తుపెట్టుకోండి.
రమేష్: హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో వాల్మీకీలకు సీటు ఇవ్వాలి. వాల్మీకీలపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేయాలి.
లోకేష్: వైసీపీ పెట్టే అక్రమ కేసుల విషయంలో నేను కూడా బాధితుడినే. అక్రమ కేసులపై పోరాడుతున్న వారిపైనా వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతోంది. చదువుకున్నవారిపై కుట్రపూరితంగా కేసులు పెడుతోంది. చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ కేసులు పెట్టిన అధికారులపై జ్యుడీషియల్ విచారణ వేసి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా ప్రోత్సహిస్తాం.
addComments
Post a Comment