*ఎస్.ఐ.హెచ్.ఎం. లో 2023-24 హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులు: రమణ ప్రసాద్*
తిరుపతి, మార్చి 24 (ప్రజా అమరావతి): కేంద్ర మరియు రాష్ట్ర టూరిజం శాఖల ఆద్వర్యంలో నిర్వహిస్తున్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యుట్రీషియన్, తిరుపతి కళాశాలలో వివిధ రకాల కోర్సులకు ఎన్.సి.హెచ్.ఎం. నిర్వహిస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ – 2023 కు ఏప్రిల్ 27 ఆఖరు తేదిగా ఉందని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని టూరిజం ఆర్.డి. మరియు ప్రిన్సిపల్ రమణప్రసాద్ తెలిపారు. శుక్రవారం మద్యాహ్నం స్థానిక ఎస్.ఐ.హెచ్.ఎం కళాశాలలో మీడియాకు వివరిస్తూ పర్యాటక రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని స్థానిక స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యుట్రీషియన్ కాళాశాల రాష్ట్రంలోనే రాష్ట్ర స్థాయి కళాశాలగా ఉందని అన్నారు. ఎన్.సి.హెచ్.ఎం. నిర్వహిస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ – 2023 మే 14 న నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అర్హత సాధించిన రాష్ట్రంలోని అభ్యర్థులు మూడు సంవత్సరాలు బి.ఎస్సీ డిగ్రీ కోర్సు నందు చేరవచ్చని, పెద్ద హోటల్స్ ఓబరాయ్, తాజ్ వంటి ప్రముఖ హోటల్స్ లలో ఇంటర్న్ షిప్ పొందవచ్చని ఆ సమయంలో ఉచిత వసతి, భోజనoతో పాటు స్కాలర్ షిప్ పొందవచ్చని తెలిపారు. 2015 లో ప్రారంభించబడి ఇక్కడ శిక్షణ పొంది పాసైన విద్యార్థులు మంచి జీతాలతో 80 శాతం మంది ఉద్యోగ అవకాశాలు పొందారని, 10 శాతం మంది స్వయం ఉపాధిలో రానిస్తున్నారని, మిగిలన 10 శాతం మంది పై చదువులకు వెళ్ళారని వివరించారు. మూడు సంవత్సరాల బి.ఎస్సీ కోర్సుతో పాటు, ఒకటిన్నర సంవత్సరాల క్రాఫ్ట్ కోర్సు ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ వయస్సు 25 సంవత్సరాలలోపు, 10/ఇంటర్ పాస్/ డిగ్రీ ఫెయిల్ అభ్యర్థులు అర్హులని ఎస్.స్సీ., ఎస్.టీ లకు 28 సంవత్సరాలు లోపుగా నిర్దేశించారని అన్నారు. అలాగే ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సు కూడా అందుబాటులో ఉందని ఇందులో 60 సీట్లు వరకు కలవని వివరించారు. ఇతర వివరాలకు అడ్మిషన్ కో-ఆర్డినేటర్ శివరామకృష్ణ 9700440604, 9100558006 , 9701343846 సంప్రదించవచ్చని తెలిపారు.
addComments
Post a Comment