శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలు-2023 వేడుకలను స్థానిక కలక్టరేట్ కార్యాలయ సమావేశమందిరంలో బుధవారం నిర్వహించుటకు ఏర్పాట్లు చేయడం జరిగింది



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


జిల్లా కలెక్టరు తూర్పుగోదావరి జిల్లా  వారి ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలు-2023 వేడుకలను స్థానిక కలక్టరేట్ కార్యాలయ సమావేశమందిరంలో బుధవారం నిర్వహించుటకు ఏర్పాట్లు చేయడం జరిగింద


ని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు. 



స్థానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులతో ఉగాది ఏర్పాట్లు పై సమావేశం నిర్విహించారు. ఈ సందర్బంగా ఆయా శాఖలు  చేపట్టాల్సిన  ఏర్పాట్లపై దిశ నిర్థేశం  చేశారు.  తొలుత బుధవారం నిర్వహించే ఉగాది వేడుకల్లో విజనగిరి బంగారాజు బృందంచే నాద స్వరం,  శ్రీ పురాణపండ జయలక్ష్మి మాధవన్ అధ్యాపకులు వారి శిష్య బృందం చే వేద పఠనం, ఆశీర్వచనం,  పుల్లెల సత్యనారాయణ, సిద్దాంతి చే పంచాంగ శ్రవణం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి బలుసు వెంకట సత్యనారాయణమూర్తి .. సమన్వయకర్త  గా వసంత కవితా గానం .. కవి సమ్మేళనం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ సంగీత కళాశాల వారి శిష్య బృందం అన్నమాచార్య కీర్తనలు, తదుపరి పాఠశాల విద్యార్థుల చే జానపద నృత్యాలు, పగటి వేషాలు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా టూరిజం అధికారి స్వామినాయుడు, దేవాదాయశాఖ అధికారి టివిఎస్ సుబ్రహ్మణ్యం, హార్టికల్చర్ అధికారి వి.రాధాకృష్ణ, డిపిఆర్వో ఐ.కాశయ్య, డివిజనల్ పిఆర్వో యం. లక్ష్మణాచార్యులు, కలక్టరేట్ ఏఓ జి. బీమారావు, సూపరింటెండెంట్ కే.రాజ్యలక్ష్మి , మ్యూజిక్ కళాశాల నాట్యాచార్యుడు పసుమర్తి శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు.




Comments