*- 2024లో భారీ మెజారిటీతో గుడివాడలోనూ గెలవబోతున్నాం
*
*- రాష్ట్రంలోనూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం*
*- లోకేష్ పాదయాత్రతో జగన్ పతనం మొదలైంది*
*- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు*
గుడివాడ, మార్చి 17 (ప్రజా అమరావతి): 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గుడివాడ నియోజకవర్గంలోనూ గెలవబోతున్నామని కృష్ణాజిల్లా గుడివాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చెప్పారు.
శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై ఉన్న ప్రజల వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అర్థమవుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన నాటినుండి జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైందన్నారు. ఈ పాదయాత్ర యువతలో స్ఫూర్తిని కలిగిస్తోందన్నారు. యువగళం పాదయాత్రకు రోజురోజుకు బ్రహ్మాండమైన స్పందన వస్తోందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీకి యువత అండగా ఉందన్నారు. రాష్ట్రాన్ని ఎవరు సర్వనాశనం చేశారో యువత అర్థం చేసుకున్నారని చెప్పారు. అక్కడక్కడ తెలుగుదేశం పార్టీని కొద్దిమంది నాయకులు వీడినప్పటికీ కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరలేదన్నారు.
కొంతమంది అధికారులు దురదృష్టవశాత్తు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీ సమావేశాలను, కార్యక్రమాలను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలకు మాత్రం సహకరిస్తున్నారన్నారు.
అన్నింటిని గుర్తుపెట్టుకుంటామని, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. అధికారమే శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే రావి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి, నాయకులు ముళ్ళపూడి రమేష్ చౌదరి, అసలేటి నిర్మల, వసంతవాడ దుర్గారావు, కంచర్ల సుధాకర్, ఆర్ వేణుబాబు, పోలాసి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment