ఎపివివిపిలో పోస్టుల భర్తీకి ఈనెల 23 నుండి 27 వరకు వాకిన్ రిక్రూట్మెంట్.



*ఎపివివిపిలో పోస్టుల భర్తీకి ఈనెల 23 నుండి 27 వరకు వాకిన్ రిక్రూట్మెంట్*

*కమీషనర్ డాక్టర్ వి.వినోద్ కుమార్*


విజయవాడ,మార్చి20 (ప్రజా అమరావతి);

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఎపివివిపి)అధ్వర్యంలోని ప్రభుత్వాసుపత్రులలో ఖాళీగా ఉన్న *సివిల్ అసిస్టెంట్  సర్జన్స్ , స్పెషలిస్ట్* పోస్టుల్ని శాశ్వత / కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసేందుకు గాను  

ఈనెల 23  నుండి 27 వరకు వాక్-ఇన్ రిక్రూట్మెంట్   నిర్వహించనున్నట్టు

 ఎపివివిపి కమీషనర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఐఎఎస్ సోమవారం నాడొక ప్రకటన లో తెలిపారు.

విజయవాడ,హనుమాన్ పేట, 

పాత గవర్నమెంట్ హాస్పిటల్ లోని

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్  కార్యాలయంలో వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తారని తెలిపారు. 

ఈనెల 23 న జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్,  డెర్మటాలజీ స్పెషాలిటీస్ కు, 25న గైనకాలజీ, ఇఎన్. టి, అనస్థీషియా,పాథాలజీ స్పెషాలిటీలకు, 27న  పెడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, అఫ్తాల్మొలజీ, రేడియాలజీ  మరియు సైకియాట్రీ స్పెషాలిటీలకు వాక్-ఇన్ రిక్రూట్మెంట్ ఉంటుందని పేర్కొన్నారు.  ఆసక్తి గల అభ్యర్థులు ఆయా తేదీల్లో సూచించబడిన ధృవపత్రాలతో వ్యక్తిగతంగా హాజరుకావాలన్నారు.

ఎస్ ఎస్ సి ,

ఎమ్.బి.బి.ఎస్  

పీజీ డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికెట్స్ ,

మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,

పీజీ మార్కుల లిస్టు, 

సోషల్ స్టేటస్ సర్టిఫికెట్ అలాగే  

4వ తరగతి నుండి 10 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ తీసుకురావాలని తెలిపారు. 

మరిన్ని వివరాల కోసం www.hmfw.ap.gov.in అనే వెబ్ సైట్ ను చూడాలని, ఏదైనా ఇతర సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే 06301138782 నంబర్ కు ఫోన్ చేయాలన్నారు.

Comments