*జిల్లాలో 46,099 మందికి జగనన్న విద్యాదీవెన
*
*తల్లుల ఖాతాల్లో రూ.27.85 కోట్లు జమ చేసిన ముఖ్యమంత్రి
*జిల్లా నుంచి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, అధికారులు
విజయనగరం, మార్చి 19 (ప్రజా అమరావతి) ః పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా జిల్లాలో 46,099 మంది లబ్ధి పొందారు. జిల్లాలోని వివిధ కళాశాలల్లో వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.27,85,91,442 నిధులు జమయ్యాయి. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ప్రయోజనం పొందారు.
2022 అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్.టి.ఆర్. జిల్లా తిరువూరు నుంచి ఆదివారం ప్రారంభించారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా అర్హులైన ఆయా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మీట నొక్కి నిధులను జమ చేశారు.
ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం రూ.27.85 కోట్ల విలువ గల మెగా చెక్కును కలెక్టర్ ఎ. సూర్యకుమారి, డీఆర్వో ఎం. గణపతిరావు, సాంఘిక సంక్షేమ డీడీ రత్నం, ట్రైబెల్ వెల్ఫేర్ డీడీ చంద్రశేఖర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ యశోధనరావు, మైనారిటీ వెల్ఫేర్ అధికారి లావణ్య ఇతర అధికారులు విజయనగరం జిల్లాకు చెందిన లబ్ధిదారులకు అందజేశారు.
*ఎవరెవరికి.. ఎంతెంత ఆర్థిక సాయం*
జగనన్న విద్యాదీవెన పథకం కింద జిల్లా నుంచి 46,099 మంది లబ్ధిపొందారని, రూ.27.85 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వర్గానికి చెందిన 37,491 మంది విద్యార్థులకు రూ.21.38 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 4,103 మందికి రూ.3.49 కోట్లు, ఈబీసీ వర్గానికి చెందిన 2,590 మందికి రూ.1.85 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 658 మందికి రూ.27.52 లక్షలు, కాపు సంక్షేమం పరిధిలో 946 మందికి రూ.67.89 లక్షలు, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీకి చెందిన 311 మందికి గాను రూ.17.68 లక్షలు లబ్ధి చేకూరిందని వివరించారు. ఈ పథకం ద్వారా అందిన ఆర్థిక సాయంతో అందరూ మంచిగా చదువుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జిల్లా నుంచి కలెక్టర్‌తో పాటు, డీఆర్వో, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ, బీసీ వెల్ఫేర్ అధికారి, మైనారిటీ వెల్ఫేర్ అధికారి, ఇతర అధికారులు, విద్యార్థులు వారి తల్లులు పాల్గొన్నారు.
addComments
Post a Comment