విజయవాడ (ప్రజా అమరావతి);
లైబ్రరి సైన్స్ లో 5 నెలల సర్టిఫికేట్ కోర్సు, శిక్షణ కొరకు దరఖాస్తులు కోరుచున్నామని ఎమ్.ఆర్. ప్రసన్న కుమార్, డైరెక్టర్ పబ్లిక్ లైబ్రరీస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్ధలలో సర్టిఫికేట్ కోర్సులైన లైబ్రరి మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులలో ఇంగ్లీషు మీడియంలో 120 సీట్లు, తెలుగు మాద్యమంలో 120 సీట్లు అందుబాటులో ఉన్నాయని. అర్హత గల అభ్యర్ధులు ఏప్రిల్ 1 తేది నుండి 21వ తేది మధ్య కాలంలో సంబంధిత సంస్ధ ప్రిన్సిపల్స్ నుండి ధరఖాస్తులను స్వీకరించాలని అన్నారు.
విజయవాడలోని పి.ఎన్ స్యూల్ ఆఫ్ సైన్స్ లో ఇంగ్రీషు మీడియంలో 40 సీట్లు, తెలగు మాధ్యమంలో 40 సీట్లు, కడపలో రాయలసీమ ఇన్‌స్టూట్‌లో లైబ్రరి మరియు ఇన్ఫర్మేషన్ కోర్సులలో ఇంగ్లీషు 40, తెలుగు 40 సీట్లు మరియు గుంటూరు సంస్ధలో ఆంగ్లం 40, తెలుగు 40 సీట్లు ఉన్నాయన్నారు. ఈ కోర్సులలో ప్రవేశానికి గుర్తింపు పొందిన విద్యాసంస్ధలనుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్నుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఒకేషనల్ ఇంటర్ విద్యార్ధులకు ప్రవేశం లేదని డైరెక్టర్ తెలిపారు. డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యూట్ విద్యార్హత కలిగిన వారికి 10 మార్కులు అదనంగా పరిగణించడం జరుగుతుందని, రిజర్వేషన్ వర్తింపు ఉంటుందని జిల్లా గ్రంధాలయ సంస్ధలలో విధులు నిర్వహించే వారికి 10 శాతం ప్రత్యేక కేటాయింపు ఉంటుందని ప్రసన్న కుమార్ తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు కొరకు సంబంధిత సంస్థ ప్రిన్సిపల్ పేరిట రెండు రూపాయాల విలువగల పోస్టల్ ఆర్డర్ జత చేయాలన్నారు. అలాగే స్వయం చిరునామా కలిగిన 10X24 సెంటి.మీ సైజు గల కవరను జతచేయాలని సూచించారు. ధరఖాస్తులను ఏప్రిల్ 21 తేది వరకు పొందవచ్చని. అభ్యర్ధులు పూర్తిచేసిన ధరఖాస్తులు పోస్టు ద్వారా కానీ, నేరుగా కానీ ఏప్రిల్ 29 వ తేది సంబంధిత ప్రిన్సిపల్ కు సాయంత్రం 5 గంటలలోగా చేరేవిదంగా పంపించాలని
డైరెక్టర్, ప్రసన్న కుమార్ తెలిపారు.
addComments
Post a Comment