చిరుధాన్యాల సాగు ను ప్రోత్సహించాలి

 ఇబ్బంది లేకుండా  ఈ- క్రాపOగ్ 


పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో  పాడి రైతులకు సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి


జిల్లా వ్యవసాయ సలహా మండలి A. రమణారెడ్డి


చిరుధాన్యాల సాగు ను  ప్రోత్సహించాలి



జిల్లా ప్రధాన కేంద్రంలో  రైతు బజార్  నిర్మాణం కొరకు స్థల సేకరణ  పక్రియ  వేగవంతం చేయాలి


రైతులను ప్రోత్సహించే విధంగా అధికారులు కృషి చేయండి


జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్



పుట్టపర్తి,  మార్చి 24 (ప్రజా అమరావతి):

  పంటలు నమోదుకు సంబంధించి ఈ -క్రాప్0గ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్  అవుటాలా రమణారెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.


పుట్టపర్తి కలెక్టరేట్లోని   సమావేశ మందిరములో  శుక్రవారం జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి  చైర్మన్ మాట్లాడుతూ ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇటీవల అకాల వర్షాల కారణంగా  వివిధ పంటల  వలన నష్టపోయిన రైతులను  గుర్తించి. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి వారి పంటలను నమోదు ప్రక్రియ చేపట్టాలని అధికారులను సూచించారు.  పంటల నమోదుకు సంబంధించిఈ క్రాప్0గ్ అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు ఇందులో క్షేత్రస్థాయిలో రైతులు ఏ పంట సాగు చేశారు, ఎన్ని ఎకరాల్లో వేశారు తదితర అన్ని రకాల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు.  మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి. ఏ పంట ఏయాలి ఏ రకం వేయాలి ఏ పంటవేయకూడదు. అనేది రైతులకు చెప్పాలి. రైతు బాగుంటేనే అంతా బాగుంటుంది.62 శాతం మంది వ్యవసాయ  అనుబంధ రంగాల పై ఆధారపడి ఉన్నారు. రైతుల విషయంలో అన్ని రకాలుగా మనం సహకారిగా ఉండాలి రైతు భరోసా కేంద్రాల ద్వారా చిరుధాన్యాలను సబ్సిడీ పైన రైతుల కు అందించి వాటి సాగును ప్రోత్సహించాలని అధికారులు కోరారు. జిల్లాలో వ్యవసాయ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. రాబోయే రబి సీజన్ కి సంబంధించి విత్తనాల సరఫరా, ఎరువులు, పంట బీమా నమోదు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఆర్బికేల ద్వారా రైతులకు కావాల్సిన సూచనలు సలహాలను ఎప్పటికప్పుడు అందించి జిల్లాలో వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.   సోమందేపల్లి మండలంలో నక్కలగుంట  హెచ్ ఎన్ ఎన్ ఎస్  కాలువ ద్వారా 150 మంది రైతులకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రధాన కేంద్రంలో మరియు మడకశిర నందు రైతు  బజారు నిర్మాణం పనులకు శ్రీకరం చుట్టాలని తెలిపారు. వైయస్సార్ పశు బీమా పథకంపై  పాడి రైతులకు విస్తృతంగా   అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని  పశుసంవర్ధక అధికారులను ఆదేశించారు,


సమావేశంలో కలెక్టర్  మాట్లాడుతూ... ఈ సంవత్సరం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరముగా ప్రకటించినందున రైతులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించి వాటి సాగును ప్రోత్సహించే విధంగా రైతులకు సూచనలు సలహాలు క్షేత్రస్థాయిలో అందివ్వాలని తెలిపారు, ఒక సెంటు భూమి కూడా తప్పిపోకుండా పంట నమోదు ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సభ్యులు తీసుకొచ్చిన సమస్యలను అధికారులు పరిష్కరించాలన్నారు. అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసి రైతుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం, ఈ క్రాప్ బుకింగ్ ఎన్ని ఎకరాలు చేయాల్సి ఉంది, ఈ క్రాప్ బుకింగ్ లో పాటించాల్సిన అంశాలు, రైతు భరోసా కేంద్రాలలో ఎరువుల లభ్యత తదితర అంశాలపై  కలెక్టర్ అధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. అలాగే రైతు భరోసా కేంద్రాల్లోని కియాస్కుల ద్వారా అందిస్తున్న సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని ప్రతి రోజు వాటిని వినియోగించాలని, గ్రామ సచివాలయంలోని గోదాములను ఎరువులు నిలువలకు వినియోగించుకునే విధంగా చూడాలని  సంబంధిత అధికారులను  ఆదేశించారు. ఇటీవల అకాల వర్షాల కారణంగా వివిధ పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి పంట వివరాలను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు నిరంతరం రైతుల  సంక్షేమానికి కృషి చేయాలని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలలో ఏ యంత్ర పరికరం ఎంత  అద్దెకు లభ్యం అవుతుంద నీ వివరాలను ఆర్ బి కే లోనే ప్రదర్శించాలని తెలిపారు. పాల ఉత్పత్తి అధికంగా ఉన్న ప్రాంతాలలో సంబంధిత పరికరాలన్నీ కష్టం హైరింగ్  సెంటర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. నాబార్డ్ ద్వారా గ్రామాలలో వ్యవసాయ అనుబంధ రంగాల సేవలను గురించి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు

జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు మాట్లాడుతూ రైతులు పండించిన పంటల వివరాలను ఆన్లైన్లో  నమోదు చేసేందుకు ఈ -పంట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. 

ఈ సమావేశంలో  ఏపీ సీడ్స్  DM. ధనలక్ష్మి, మార్కెటింగ్ అధికారి  గీతమ్మ,  నాబార్డ్ అధికారిని  గీతమ్మ,DWMA  పిడి  రామాంజనేయులు,   జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, సిరికల్చర్ జెడి  పద్మావతి, జిల్లా అగ్రికల్చర్ ట్రేడ్ & మార్కెటింగ్ అధికారి నరసింహమూర్తి,  పశుసంవర్ధక శాఖ  జెడి  శుభ  దాస, సివిల్ సప్లై అధికారి అశ్వత్,కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం , ఏపీఎంఐపి పిడి సుదర్శన్, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ప్రొగ్రెసివ్ ఫార్మర్స్ కేశవ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సుదీర్ రెడ్డి,   డి ఆర్ సి   ప్రతినిధులు శ్రీమతి విద్యావతి,  సనావుల్లా,తదితరులు పాల్గొన్నారు.



Comments