అధికారుల, ఉపాధ్యాయుల నిరంతరం పర్యవేక్షణ తోనే సాధ్యం


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


* పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్  ప్రకాష్ జిల్లాలో  పర్యటన 


* ప్రతి రోజు ఈ రోజు కంటే మెరుగ్గా ఉండాలి


* పిల్లల్లో ప్రేరణ కలిగించేలా పనిచేద్దాం 


* నాడు నేడు పనుల విషయంలో, జగనన్న కిట్స్ విషయంలో రాజీ ప్రసక్తే లేదు


* ఇవి విద్యా శాఖకు అత్యంత ప్రతిష్టత్మకం 


* అధికారుల, ఉపాధ్యాయుల నిరంతరం పర్యవేక్షణ తోనే సాధ్యం 
రాజమహేంద్రవరం లో పలు స్కూల్స్, సచివాలయా లను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ


ముఖ్య కార్యదర్శి వెంట జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఇతర జిల్లా అధికారులు


రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, పిల్లల్లో  పౌష్టికాహరం లోపం అధిగ మించేందుకు, సచివాలయ వ్యవస్థ ద్వారా మెరుగైన పౌర సేవలను అందించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్  ప్రకాష్ పేర్కొన్నారు.


 పర్యటన లో భాగంగా శుక్రవారం స్థానిక శ్రీ నన్నయ్య మునిసిపల్ హైస్కూల్, ఆర్యాపురం, శ్రీ పంతం సత్యనారయణ హై స్కూల్, తుమ్మలావ మునిసిపల్ ప్రాథమిక  పాఠశాలలను కలెక్టర్ మాధవీలత, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ లతో కలసి సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్బంగా ప్రవీణ్  ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి రోజూ మంచి ఫలితాలను సాధించడానికి , ఈ రోజు కంటే రేపు, తరువాతి రోజూ, ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం కోసం ఎన్నో సంస్కరణలను తీసుకుని రావడం జరిగిందని అన్నారు. ఉపాధ్యాయుల, పిల్లల కు అందచేసిన ట్యాబ్ ల వినియోగం వారు వాడిన నిమిషాల ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. 7500 నిమిషాలు ఐతే డిస్టిక్షన్, 6 వేలు అయితే ఫస్ట్ డివిజన్, 3 వేలు అయితే పాస్ అయినట్లు అని పిల్లలకు తెలియచేశారు.   ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పిల్లలకు అందచేసిన ట్యాబ్ పని తీరును ప్రవీణ్ ప్రకాష్ తనిఖీ చేశారు.  అనంతరం వర్క్స్ బుక్స్ ను పరిశీలించి విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


నాడు నేడు కింద చేపడుతున్న  స్కూల్ లో చేపడుతున్న పనుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, చేపడుతున్న చర్యలు ఈరోజు కంటే తదుపరి రోజు మరింత మెరుగ్గా ఫలితాలు కలుగ చేసే విధానం అమలు చేయడం ముఖ్యం అన్నారు. ఒకటవ తరగతి బోధన నుంచి తదుపరి 2,3 4, 5, 6, 7 ల కొనసాగింపుగా ప్రతి తరగతి పెరిగే కొద్దీ విద్య భోధన ప్రమాణాలు పెరగడం ముఖ్యం అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు.  సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, స్కూల్స్ లో విద్యా వాలంటీర్ వ్యవస్థ అనేది మన వద్ద మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు.  నిరంతరం పిల్లల్లో ప్రేరణ కలిగించే విధంగా పనితీరు మెరుగుపరుచు కోవడం ముఖ్యం అన్నారు. ఎవరి మెప్పు కోసం కాకుండా మన పిల్లల భవిష్యత్తు కోసం పని చెయ్యడం భాద్యతగా తీసుకోవాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకం కింద అందచేస్తున్న కోడి గుడ్డులను పరిశీలించి విద్యార్థులకు అందచేస్తున్న ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. మార్చి ఒకటవ తేదీ నుంచి అమలు చేస్తున్న మెనూ కార్డ్ ప్రకారం చేపడుతున్న చర్యలు పై అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు. 


ఈ పర్యటన లో భాగంగా తొలుత శ్రీ నన్నయ్య మునిసిపల్ హైస్కూల్, ఆర్యాపురం, శ్రీ పంతం సత్యనారయణ హై స్కూల్, తుమ్మలావ మునిసిపల్ ప్రాథమిక  పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించి, వారిని ఉత్తేజ పరిచారు.సచివాలయం సందర్శన : 


అనంతరం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 35,36, 37 వార్డు సచివాలయాలను ఆకస్మికంగా ముఖ్య కార్యదర్శి ప్రవీణ ప్రకాష్ , మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రికార్డ్ ల నిర్వహణ, ప్రజలను అందచేస్తున్న పౌర సేవలు వివరాలు తెలుసుకోవడం జరిగింది. వెల్ఫేర్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో మొబైల్ యాప్ ద్వారా ఆ సచివాలయం ద్వారా ప్రయోజనం కలుగుతున్న వారి డేటా, వారికి అందచేసిన సంక్షేమ పథకాలు వివరాలను పరిశీలించారు. Comments