యువగళం దెబ్బకి జగన్ దిమ్మ తిరిగిపోయింది. మైండ్ బ్లాంక్ అయ్యింది.

 కదిరి నియోజకవర్గం (ప్రజా అమరావతి);


జోగన్నపేట బహిరంగ సభ...


ఖాద్రీ నరసింహుడు కొలువైన నేల కదిరి. 

తెలుగు కవి యోగి వేమన తిరిగిన నేల ఇది. 

ప్రపంచంలోనే అతిపెద్ద పవిత్రమైన మర్రిమాను ఉన్న ప్రాంతం ఇది. 

దక్షిణ భారతదేశంలోనే గొప్ప హిందు క్షేత్రమైన కదిరి హిందు-ముస్లిములు మత సామరస్యానికి పెట్టింది పేరు. 

బంగారు ఖనిజంతో పాటు మేలిమి బంగారం లాంటి ప్రజలు కలిగిన ప్రాంతం కదిరి.

ఎంతో గొప్ప చరిత్ర ఉన్న కదిరిలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కదిరి లోని దేవాలయాలు, పర్యాటక కేంద్రాలను అభివృద్ది చేసి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తాం.

యువగళం దెబ్బకి జగన్ దిమ్మ తిరిగిపోయింది. మైండ్ బ్లాంక్ అయ్యింది. 


రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకూ ఒకటే స్లోగన్..సైకో పోవాలి...సైకిల్ రావాలి. 

నా వెంట్రుక కూడా పీకలేడు అన్నాడు. ఇప్పుడు ప్రజలు జగన్ కి గుండు కొట్టారు. 

చరిత్రలో ఎప్పుడైనా అధికార పార్టీ అభ్యర్థి ధర్నా చెయ్యడం చూసామా? అది మన పసుపు జెండా పవర్. 

భయం...భయాన్ని జగన్ కి పరిచయం చేసాం. 

స్టేట్ మొత్తాన్ని సైకిల్ స్వీప్ చెయ్యడం ఖాయం. ఫ్యాన్ కి సింగిల్ డిజిట్ ఖాయం. 

జగన్ వై నాట్ 175 అన్నాడు. ఇప్పుడు 175 నియోజకవర్గాలు బైబై జగన్ అంటున్నాయి. 

ఇది సైకో పాలన పై ప్రజల విజయం. 

ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా 2024 లో చూపిస్తాం. 

ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ని మిస్ యూజ్ చేసుకున్న ఫెయిల్డ్ సీఎం జగన్. 

ఎవరైనా సింగపూర్, అమెరికా ని ఆదర్శంగా తీసుకుంటారు. 

మన ఫెయిల్డ్ సీఎం ఆఫ్రికా ని ఆదర్శంగా తీసుకున్నాడు. 

మూడు రాజధానులు అంటూ మాయ చెయ్యాలని చూసాడు. ఒక్క ఇటుక పెట్టలేదు. 

ఇప్పుడు మూడు ప్రాంతాల ప్రజలు జగన్ కి మూడు మొట్టికాయలు వేసారు. 

సీఎం అయిన ఎవరైనా ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించి పాలన ప్రారంభిస్తారు. 

కానీ మన ఫెయిల్డ్ సీఎం ప్రజా వేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించాడు. 

సీఎం అయిన తరువాత ఎవరైనా మొదట చేసే పని పరిశ్రమలు తీసుకురావడం. 

కానీ ఫెయిల్డ్ సీఎం కథ వేరు...ఈయన సీఎం అయిన వెంటనే పీపీఏ లు రద్దు చేసి ఉన్న కంపెనీలను తరిమేసాడు. 

సీఎం అయిన తరువాత అభివృద్ధి, సంక్షేమం లో పోటీపడతారు. 

మన ఫెయిల్డ్ సీఎం జగన్  మాత్రం కేవలం ప్రతిపక్షం పై కక్ష సాధింపు ఎజెండా గా పెట్టుకున్నాడు.

సీఎం అయిన ఎవరైనా పెట్టుబడులు తీసుకురావడంలోనూ, ఉద్యోగాల కల్పన లోనూ నంబర్1 చెయ్యాలి అనుకుంటారు. 

కానీ ఫెయిల్డ్ సీఎం జగన్ ఏపీని అప్పుల్లోనూ, గంజాయి లోనూ, పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ నంబర్1 చేసాడు.

యువత, మహిళలు, వృద్ధులు, రైతుల్ని మోసం చేసాడు ఫెయిల్డ్ సీఎం జగన్. 

యువతకు అనేక హామీలు జగన్ అనేక హామీలు ఇచ్చారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి ఏడాది 6,500 పోలీసు ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా డీఎస్సి. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేక ఫెయిల్డ్ సిఎం అనిపించుకున్నాడు. 

టిడిపి గెలిచిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం.

మహిళల్ని ముంచేసాడు ఫెయిల్డ్ సీఎం జగన్. మద్యపాన నిషేధం, 45 ఏళ్లకే ఎస్సి,ఎస్టీ,బిసి, మైనార్టీ మహిళలకు పెన్షన్, ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తానని హామీ ఇచ్చాడు. ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. 

టిడిపి గెలిచిన తరువాత నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. పన్నుల భారాన్ని తగ్గిస్తాం.

వృద్ధులకు 3 వేల పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఫెయిల్డ్ సీఎం జగన్ 6లక్షల పెన్షన్లు కట్ చేసాడు. 

రైతు రాజ్యం తీసుకొస్తా అన్నాడు. 3500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, టమాటో రైతులకు కచప్ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజీలు అన్నాడు. వేరుశనగ రైతుల్ని ఆదుకుంటా అన్నాడు. ఒక్క హామీ నిలబెట్టుకోకపోగా రైతుల మెడలో మీటర్ల ఉరి తాడు బిగిస్తున్నాడు. 

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే టమోటో ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్ లు, కచప్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తాం.

ఉద్యోగస్తులకు వారంలో పెన్షన్ రద్దు అన్నాడు. పోలీసులకు వీక్లీ ఆఫ్ అన్నాడు. ఫెయిల్డ్ సీఎం జగన్ ఇప్పుడు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి. పోలీసులకు సరెండర్స్ పెండింగ్ పెట్టాడు. 

ముస్లింలను వేధించిన పాపం జగన్ ని వదలదు. 

ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం అని ముస్లింలు భావిస్తారు. అలాంటి వారికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చాడు జగన్. 

అబ్దుల్ సలాం కుటుంబం పై దొంగ అనే ముద్ర వేసి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసారు. 

స్కూల్ లో టాపర్ గా ఉన్న మిస్బా ని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.

హాజిరా ను అత్యాచారం చేసి చంపేసారు. 

మసీదు భూములు కాపాడుకోవడానికి పోరాడిన ఇబ్రహీం ని చంపేసారు. 

విదేశీ విద్య, దుల్హన్ పధకాలు అమలు కావడం లేదు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ అభివృద్ధి కి ఒక్క రూపాయి ఇవ్వడం లేదు.  

బీసీల బ్యాక్ బోన్ విరిచేసాడు జగన్. 

స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 10 శాతం కట్ చేసాడు. 

నిధులు లేని పదవులు బీసీలకు. పవర్ ఉండే పదవులు అన్ని ఒకే సామాజిక వర్గానికి. 

జగన్ హయాంలో బిసిల పై 25 వేల అక్రమ కేసులు పెట్టారు.

టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత బిసిల రక్షణ కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం అమలు చేస్తాం.

జగన్ పాలనలో దళితులకు వేధింపులే మిగిలాయి.

దళితుల్ని చంపి డోర్ డెలివరీ చెయ్యడానికి స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు. 

దళితుడ్ని సుబ్రహ్మణ్యం ని చంపిన అనంతబాబు కి సన్మానం చేసాడు జగన్ రెడ్డి. 

డాక్టర్ సుధాకర్, అనితా రాణి, కిరణ్, వరప్రసాద్, ఓం ప్రతాప్ ఇలా ఎంతో మంది బాధితులు ఉన్నారు. 

దళితులకు ఇస్తానన్న ఉచిత 200 యూనిట్ల విద్యుత్ ఇవ్వలేదు.

జగన్ రాయలసీమ బిడ్డ అని ప్రచారం చేసుకున్నాడు. 

ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ. 

రెండు సార్లు కడప ఉక్కు ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేసాడు. ముందు 20 వేల మందికి ఉద్యోగాలు అన్నాడు. ఇప్పుడు 6 వేల మందికి అంటున్నాడు. 

రెండు సార్లు చేసిన శంకుస్థాపన కోసం సొంత మీడియా కి 30 కోట్లు ప్రకటనలు ఇచ్చాడు. 30 పైసలు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఖర్చు చెయ్యలేదు.

అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది.

రిలయన్స్, అమరరాజా వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.

అన్నమయ్యా గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు.

హంద్రీనీవా, గాలేరు నగరి ఇలా టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే.

కియా కారు చూస్తే అనంతపురం గుర్తు వస్తుంది. దటీజ్ చంద్రబాబు గారు. డ్రిప్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు ఇలా ఏమి చూసినా చంద్రబాబు గారు గుర్తు వస్తారు. 

జగన్ కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. అనంతపురం కి నువ్వు తెచ్చిన ఒక్క కంపెనీ ఉందా?ఒక్క అభివృద్ధి కార్యక్రమం నువ్వు చేసావా?

కదిరి నియోజకవర్గానికి జగన్, వైసిపి నేతలు అనేక హామీలు ఇచ్చారు అందులో ఒక్కటైనా నిలబెట్టుకున్నారా?

కదిరి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ఉన్న డ్రైనేజీలను కూడా రెగ్యులర్ గా శుభ్రం చేయించలేకపోతున్నారు. మున్సిపాలిటీలో చీపుర్లు కొనడానికి కూడా డబ్బులు లేవంటున్నారు. 

ఔటర్ బైపాస్ లో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్నారు. పరిశ్రమల మాట దేవుడెరుగు. బైపాస్ లో ఒక్క టీ షాపు కూడా పెట్టించలేదు. బైపాస్ నిర్మాణం ఇదే స్పీడులో జరిగితే మరో ఐదేళ్లయినా పూర్తవదు..

బట్రేపల్లి జలపాతం, తిమ్మమ్మ మర్రిమానును పర్యాటకంగా అభివ్రుద్ధి చేస్తామన్నారు.  దీని కోసం మంజూరు చేసిన ఉపాధి నిధుల్ని కూడా వాడుకోలేక వదిలేశారు. 

ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా మారుస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. 

కదిరి ఎమ్మెల్యే గారి పేరు సిద్దారెడ్డి. ఆయన ప్రజల సొమ్ము కొట్టేయడంలో సిద్దహస్తుడు. 

ఎన్పీ కుంటలో ఏర్పాటు చేసిన సోలార్ పార్కులో నిర్వహణకు 9 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఆయా కంపెనీలపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి డబ్బులు వసూలు చేశారు. అన్ని కంపెనీల నుంచి కలిపి 8 కోట్ల వరకు వసూలు చేశారు. సెక్యురిటీ ఏజెన్సీ వారికి బెదిరించి పంపించాలని చూశారు. తమకు చెందిన కంపెనీకే అక్కడ సెక్యురిటీ ఏజెన్సీ ఇప్పించాలని ప్రయత్నించారు. దీంతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గ్రామాలకు సోలార్ పార్కు ఇచ్చిన నిధుల్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు. 

నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో 50 వేల రూపాయలకు మించి ఏ కాంట్రాక్ట్ అయినా సరే సిద్ధారెడ్డి కంపెనీకే పనులు దక్కుతాయి.  గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాలు మొత్తం సిద్ధారెడ్డికి చెందిన కంపెనీకే కట్టబెట్టారు. కానీ ఈ మహానుభావుడు కంకర వేసి వదిలేశారు. తక్కువ పనిచేసి ఎక్కువ మొత్తంలో బిల్లులు డ్రా చేసుకున్నారు. నల్లచెరువు మండలం తుమ్మల రోడ్డు నుంచి ఇందుకూరిపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనుల్ని తీసుకుని కంకర వేసి వదిలేశారు. రెండేళ్ల నుంచి గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. అలాగే గాండ్లపెంట మండలం తుమ్మలబయలు నుంచి గొడ్డువెలుగుల వరకు రోడ్డు అదే పరిస్థితి. తలుపుల, తనకల్లు మండలాల్లోనూ పలు గ్రామాల్లో ఇదే దుస్థితి. 

గ్రామాల్లో రోడ్లు వేయని ఎమ్మెల్యే సిద్దారెడ్డి కదిరిలో తన అపార్ట్ మెంట్ కు మాత్రం 50 లక్షలు పెట్టి రోడ్డు వేసుకున్నారు. 

ఖాద్రీ నరసింహుడు కోనేరులోకి మురుగునీరు రాకుండా ఉండటం కోసం 2కోట్ల 30 లక్షలతో మోడర్నైజేషన్ చేపట్టారు. అనంతపురానికి చెందిన కంపెనీకి పనులు అప్పగించారు. అయితే బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అంతా తానై నడిపించారు. అత్యంత నాసిరకం పనులు చేయడంతో వరదలకు కొట్టుకుపోయింది.  దేవుడి డబ్బు రెండు కోట్లు నొక్కేశాడు. 

తన కంకర మిషన్ నుంచి వేస్టేజ్ ను పారేయడం కోసం నలుగురు రైతులకు చెందిన పొలాలు లాక్కున్నారు. కదిరి మండలం అలంపూర్ గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములకు 8 ఎకరాలు గతంలో ప్రభుత్వం కేటాయించింది. 30 ఏళ్లుగా వారు అక్కడ వ్యవసాయం చేస్తున్నారు.  దీనిపక్కనే ఎమ్మెల్యే క్రషర్ ఉంది. దాని నుంచి వచ్చే వేస్టేజ్ ను వీరి పొలంలో పారేయడం కోసం అసలు వారికి అక్కడ భూమే లేదని అధికారులతో చెప్పించి దౌర్జన్యం చేయించారు. తన లాభం కోసం పేద రైతుల్ని బలిచేస్తున్నారు.  

గ్రామీణ నీటి సరఫరా కాంట్రాక్టర్ పై తప్పుడు ఆరోపణలు చేయించి ఆ పనుల్ని తనకు అనుకూలమైన వారికి అప్పగించారు. కదిరి నియోజకవర్గంలోనే తాగునీటి సరఫరాలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుని కార్మికులకు మాత్రం అరకొర వేతనాలు చెల్లిస్తున్నారు. భారీ మొత్తంలో శ్రమదోపిడికి పాల్పడుతున్నాడు. 

అనంతపురంలో ఎమ్మెల్యే సిద్దారెడ్డి బంధువు హరినాథ్ రెడ్డి ద్వారా భూకబ్జాలకు పాల్పడుతున్నాడు. అనంతపురం నగరం సమీపంలోని ఇటుకులపల్లి, రాచానపల్లి, కందుకూరు, కురుగుంట గ్రామాల్లో 20 నుంచి 30 ఎకరాలు కబ్జా చేశారు. 

కదిరి మున్సిపాలిటీలో 14, 15 ఫైనాన్స్ నిధులకు తనకు అనుకూలమైన కాంట్రాక్టర్ల కోసం మళ్లించారు. కదిరి పట్టణంలో ఏ ఇళ్లు కట్టాలన్నా ఎమ్మెల్యే అనుమతి ఉండాల్సిందేనట. డబ్బులు తీసుకుని ఓ బిల్డింగ్ కు అనుమతి లేకపోయినా చూసిచూడనట్లు వదిలేశారు. ఆ బిల్డింగ్ నిర్మాణంలో ఉండగానే.. కూలిపోయి 6 మంది చనిపోయారు. 

కదిరి నియోజకవర్గంలో అత్యధిక శాతం యువత ఉపాధి కోసం వలసలు వెళ్లిపోతున్నారు.  తనకల్లు మండలం మినహా మిగిలిన 5 మండలాల్లో సాగునీటి సౌకర్యం లేదు. హంద్రీనీవా ప్రధాన కాలువ కదిరి మీదుగానే పుంగనూరు వెళ్తున్నా ఇక్కడి పంట పొలాలు బీళ్లుగానే ఉంటున్నాయి. హంద్రీనీవా నుంచి కదిరిలోని చెరువులో నింపగలిగితే కొంతమేర కరువును జయించి వలసల్ని అరికట్టవచ్చు. 

కదిరి ప్రాంతంలో రైతులు ఎక్కువగా వేరుసెనగ, టమాటా వంటివి ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే గిట్టుబాటు ధరలు లేక ఏటా నష్టపోతున్నారు. ఇక్కడ వేరుసెనగ పరిశోధన స్థానం టీడీపీ హయాంలో ఏర్పాటు చేసాం. వైకాపా వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేశారు. ఈ ప్రాంతంలో వేరుసెనగ, టమాటకు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. 

వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో నాటుసారా విపరీతంగా పెరిగిపోయింది. మద్యం ధరలు మూడింతలు పెరగడంతో గ్రామాల్లో నాటుసారా ఉత్పత్తికి డిమాండ్ పెరిగింది. చాలామంది తాండా వాసులు ఇందులోకి దిగి కేసుల్లో ఇరుక్కున్నారు. వారిని దీన్ని నుంచి బయట పడేయడం కోసం ప్రత్యేక కార్యచరణ చేపడతాం. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల చూపిస్తాం. 

కదిరి నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తారు. చాలామంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ లో చిక్కుకుని జీవితాలను కోల్పోయారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మంచి పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించిన వారిని నేను వదలను.

అమ్మ ను అవమానించిన వైసిపి నాయకులని కట్ డ్రాయర్ పై నిలబెట్టి ఊరేగిస్తాం.

బాధలు పోవాలి అంటే బాబు రావాలి...

Comments