రాజధానే లేనప్పుడు పెట్టుబడిదారులకు నమ్మకం ఎలా?: గంటా
విశాఖపట్నం (ప్రజా అమరావతి): రేపటి నుంచి విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్‌కు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు..
పెట్టుబడుల సదస్సుకు ముందు కొన్ని ప్రశ్నలను సీఎంకు ఆయన సంధించారు. రాష్ట్రానికి రాజధానే లేనప్పుడు పెట్టుబడిదారులకు నమ్మకం ఎలా వస్తుందని గంటా ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి 'లులు', 'అమర్‌రాజా' వంటి సంస్థలను వెళ్లగొట్టామని చెప్తారా? అని వ్యంగ్యంగా ఆయన వ్యాఖ్యానించారు..
అదానీ డేటా సెంటర్‌కు గతంలోనే శంకుస్థాపన జరిగినప్పటికీ ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. అదే కంపెనీకి మళ్లీ భూమి కేటాయించడం వెనుక ఆంతర్యమేంటని నిలదీశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలే ఇవ్వలేని ప్రభుత్వాన్ని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. పెట్టుబడుల సదస్సు పేరుతో హడావుడి వెనుక కారణాలేంటో ప్రజలకు వివరించాలన్నారు..
addComments
Post a Comment