నెల్లూరు (ప్రజా అమరావతి);
నెల్లూరులోని క్యాంప్ ఆఫీస్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
ఆంధ్ర, తెలంగాణ మధ్య చిచ్చుకు రామోజీ కుట్ర
రామోజీ రాతలపై మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్
కేసీఆర్, చంద్రబాబు పాలనలో వ్యత్యాసంపై రాయగలవా?
చంద్రబాబు కరవు, జగన్‌గారి సుభిక్ష పాలనపై రాతలేవి?
రామోజీని సూటిగా ప్రశ్నించిన మంత్రి గోవర్థన్‌రెడ్డి
విషయ పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం లేని రామోజీ
ఎన్దీఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ ఏకీకృత ప్రామాణికాలు
2015 నాటి జీవో ఆధారంగానే ఇన్‌ఫుట్ సబ్సిడీ
మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టీకరణ
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రశ్నలే రామోజీ రాతలు
ఇన్‌ఫుట్ సబ్సిడీపై అప్పుడే సమాధానం చెప్పాం
రాష్ట్రంలో రైతుల తలరాతలు చాలా బాగున్నాయి
అయినా రామోజీకి కనిపించదు. అందుకే రోతరాతలు
మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్‌రెడ్డి వెల్లడి
జగన్‌గారి దయా దాక్షిణ్యాలతోనే ఎమ్మెల్యేలయ్యాం
పార్టీ అధినేత నిర్ణయమే మా అందరికీ శిరోధార్యం
పార్టీకి ద్రోహం చేసింది కాకుండా విమర్శలా?
సస్పెండైన ఎమ్మెల్యేల తీరు ఇకనైనా మారాలి
ప్రెస్‌మీట్‌లో మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్‌రెడ్డి
నెల్లూరు:
ప్రెస్‌మీట్‌లో మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..:
రాష్ట్రాల మధ్య చిచ్చుకు రామోజీ కుట్ర:
ఆంధ్ర, తెలంగాణ మధ్య విభేదాల సృష్టికి రామోజీ కుట్ర చేస్తున్నారు. అందుకే ఈ రోత రాతలు రాస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు సంబంధించి ఎలాంటి విధానాలు అమలవుతున్నాయన్న అంశాన్ని విశ్లేషిస్తూ రామోజీరావు పెద్ద కుట్ర చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య విబేధాల సృష్టికి కంకణం కట్టుకుని పని చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంటే చంద్రబాబుకు సంతోషంగా ఉంటుందని, అప్పుడు పండగ చేసుకోవాన్నది రామోజీ దురాలోచన. ఎక్కడైనా ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలకు తగినట్లు విధానాలు ఉంటాయి. సంక్షేమ పథకాలు అమలవుతాయి. అలాంటప్పుడు, రెండింటినీ పోలుస్తూ రామోజీ అలా ఎలా రాస్తారు?.
రామోజీ మీకా దమ్ముందా?:
రామోజీ.. మీకు నిజంగా దమ్మూౖ ధెర్యం ఉంటే చంద్రబాబు హయాంలో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల విధానాలు పోలుస్తూ, కథనాలు రాయగలరా? ఇది నా సవాల్.
ఒకవేళ ఆ ధైర్యం లేకపోతే కనీసం ఇప్పుడు ఆంధ్రలో జగన్‌గారి ప్రభుత్వం రైతులకు ఏమేం చేస్తోంది? గత 5 ఏళ్లలో చంద్రబాబు అదే రైతుల కోసం ఏం చేశాడు? అన్న విషయాన్ని అయినా రాయగలరా? అలా ఒక వేళ రాస్తే.. చంద్రబాబు హయాంలో కరవు మండలాల దగ్గర్నుంచి రాయాలి. బాబు హయాంలో ఏటా కరవే. అదే జగన్‌గారి పాలనలో కరవు లేదు. అందుకే ఈ మూడున్నర ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కరవు మండలాలు ప్రకటించలేదు. ఈ విషయాన్ని మీ పత్రికలో రాయగలరా రామోజీ? ఇది కూడా నా సవాల్.
వైఖరి మార్చుకొండి:
చంద్రబాబు హయాంలో తిత్లీ తుఫాను సమయంలో ప్రకటించి ఎగొట్టిన పరిహారాన్ని కూడా సీఎం శ్రీ వైయస్ జగన్ చెల్లించిన మాట వాస్తవం కాదా? మరి ఆ వాస్తవాల్ని ఈనాడులో ఎందుకు రాయరు?. రామోజీ, మీరు వయసుకు తగ్గ పనులు చేయాలి కానీ, ఇలా నీతి మాలిన రాతలతో ప్రభుత్వంపై బురద చల్లొద్దు. లేకుంటే తగిన బుద్ధి చెబుతాం.
అప్పటి జీఓ ప్రకారమే:
భారీ వర్షాలు, వరదల్లో పంటల నష్ట పరిహారంపై గత ప్రభుత్వం 2015, డిసెంబరు 4న ఒక జీఓ జారీ చేసింది. వరి, వేరుశనగ, చెరకు, ఉల్లి, బొప్పాయి, పుచ్చకాయ తదితర పంటలకు హెక్టారుకు రూ.15 వేలు పరిహారం ఇస్తున్నామని ఆ జీఓలో వెల్లడించారు. సాధారణంగా ఎన్డీఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్), ఎస్‌డిఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ప్రామాణికాల మేరకే రాష్ట్ర ప్రభుత్వాలు జీఓలు జారీ చేసి అమలు చేస్తాయి. అందుకే మేము ఆ జీఓను ఇప్పటికీ అమలు చేస్తున్నాం. కానీ, ఆ జీఓపై రామోజీరావుకు కనీస అవగాహన లేకుండా ప్రభుత్వంపై బురద చల్లడాన్ని ఖండిస్తున్నాం.
రైతుల పక్షపాతి జగన్‌గారు:
రాష్ట్రంలో వర్షాలు కురవగానే అధికారులతో సమావేశమైన సీఎంగారు.. రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని, వానిరి ఇన్‌ఫుట్ సబ్సిడీ ఎలా ఇవ్వాలన్న దానిపై దృష్టి పెట్టాలని, ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయొద్దని, ఎక్కడా ఉదాసీనత పనికి రాదని స్పష్టం చేశారు. అలాగే ఈ–క్రాప్‌లో నమోదైన పంట వివరాలతో పాటు సీజన్‌కు ముందే పంట వేసిన (ఈక్రాప్‌లో నమోదు కాని) రైతుల వివరాలు కూడా సేకరించాలని, ఆ జాబితాల ప్రకారం అందరికీ ఇన్‌ఫుట్ సబ్సిడీ అందజేయాలని ఆదేశించారు.
టీడీపీ ప్రశ్నలే రామోజీ రాతలా?:
టీడీపీకి బాకానే రామోజీ పని. అందుకే రాష్ట్రంలో రైతులకు అందజేస్తున్న పంట నష్ట పరిహారంపై అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రశ్నలనే ఈనాడులో రాస్తున్నారు. సభలోనే మేము ఆ ప్రశ్నలకు స్పష్టంగా బదులిచ్చాం. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డిఆర్‌ఎఫ్ ప్రామాణికాల ప్రకారం, నాడు టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారమే ఆ పరిహారం చెల్లిస్తున్నామని చెప్పాం. ఎందుకంటే, అప్పటి నుంచి ఆ ప్రామాణికాలు మారలేదన్న విషయాన్ని కూడా స్పష్టం చేశాం. దాంతో సభలో ఆ ప్రశ్న అడిగిన సభ్యుడు నోరు మెదపకుండా కూర్చున్నాడు. కానీ ఇప్పుడు రామోజీ మళ్లీ అవే ప్రశ్నలు పట్టుకుని రోత రాతలు రాస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు.
అసలు రామోజీ ఒక పత్రికాధిపతినా? లేక రాజకీయ నాయకుడా? ఆయన ఎలా పని చేస్తున్నాడు? అన్న విషయం అర్ధం కావడం లేదు. రాజకీయాల్లో చంద్రబాబుకు సలహాదారుగా ఉన్న రామోజీరావుకు ఒక ప్రతిక అధిపతిగా ఇంగిత జ్ఞానం ఎటూ లేదు. కనీసం విషయ పరిజ్ఞానమైనా ఉందా? అంటే, అదీ లేదు.
వారి వైఖరి సరికాదు:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి వాస్తవాల నిర్ధారణ తర్వాతే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ, రెండ్రోజులుగా వారు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పార్టీని విమర్శిస్తున్నారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రజా జీవితంలో గెలుపు ఓటములు సహజం. కానీ, ఏ పార్టీ అధినేత దయా దాక్షిణ్యాలతో గెల్చామో.. ఆయన పట్ల, ఆయన నిర్ణయం పట్ల గౌరవంగా మసలుకోవాలి. అంతేకానీ, తప్పు చేసి పార్టీ అధినేతను తూలనాడితే ప్రజలు హర్షించరు. పార్టీకి ద్రోహం చేయడమే కాకుండా, ఇప్పుడిలా మాట్లాడటం మంచిది కాదు.
ఎమ్మెల్యేలు అమ్ముడు పోయింది వాస్తవం:
కొందరు ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అనడంలో తప్పేం లేదు. అది ముమ్మాటికీ వాస్తవం. అయినా గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? తామేం చేశామన్నది వారి అంతరాత్మకు తెలుసు. అంతే కానీ, సీఎంగారిని, సజ్జల గారిని విమర్శించడం సరి కాదు. ఇకనైనా ఎమ్మెల్యేలు ఆరోపణలు మాని, ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని మంత్రి కాకాణి అన్నారు.
addComments
Post a Comment