సమాజంలో షెడ్యూల్డ్ కులాలకు మరింతగా ఆర్ధిక ప్రయోజనం కలిగేలా


నెల్లూరు (ప్రజా అమరావతి);

సమాజంలో షెడ్యూల్డ్ కులాలకు మరింతగా ఆర్ధిక ప్రయోజనం కలిగేలా 


రూపొందించిన  షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను జిల్లాలో పటిష్టంగా  అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు, సంబంధిత అధికారులను ఆదేశించారు. 


షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక అమలపై  శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, సంబంధిత అధికారులతో సమీక్షించారు.  సమాజంలో షెడ్యూల్డ్ కులాలు  ప్రయోజనం పొందేలా మరియు వారి అభివృద్ధికి తగిన నిధులు కేటాయించేలా ప్రభుత్వం యొక్క సామాజిక-ఆర్థిక మరియు ఆర్థిక సమ్మేళన వ్యూహంలో భాగంగా, ఎస్.సి ల కోసం రూపొందించిన  అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక (DAPSC)ను జిల్లాలో  పటిష్టంగా  అమలు చేయాలని జిల్లా కలెక్టర్,  అధికారులను ఆదేశించారు.  షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక  మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో  అమృత జలధార, యువ పారిశ్రామికవేత్తల  పథకం తదితర పధకాలకు  సంబంధించిన ఎస్.సి  లబ్ధిదారులను గుర్తించి  వారికి మరింతగా ఆర్ధిక వెసులబాటు కల్పించేలా  చర్యలు తీసుకోవాలని,  సంబంధిత వివరాలను  వారం రోజుల్లో  సమర్పించాలని జిల్లా  కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, అధికారులను ఆదేశించారు. 

ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ విద్యాధరి, ఎల్.డి.ఎం  శ్రీకాంత్ ప్రదీప్  కుమార్, ఎస్.సి కార్పొరేషన్ ఈ.డి  సారయ్య, డ్వామా పి.డి.  వెంకట్రావు,  భూగర్భ జల శాఖ, పరిశ్రమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Comments