రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
ఓ.ఎన్.జి.సి.(ONGC) వారు “స్పోర్ట్స్ స్కాలర్ షిప్ పథకము" 2023-24 కింద
ప్రతిభ గల క్రీడాకారులకు ఆర్ధిక సహకారము అందించనున్నట్లు మరియు జాతీయ స్థాయి సీనియర్ మహిళల ఆంధ్రా కబడ్డీ జట్టు ఎంపికలు చేపట్టడం జరుగుతోందని జిల్లా ముఖ్య క్రీడాధికారి డి ఎం ఎం శేషగిరి రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలోని ఆశక్తి గల ప్రతిభ గల క్రీడాకారులు అందరు ఓ.ఎన్.జి.సి. (ONGC) వారి స్పోర్ట్స్ స్కాలర్ షిప్ పథకము ఈ క్రింది వెబ్ సైట్ : http://sportsscholarship.ongc.co.in నుండి ధరఖాస్తు చేసుకొనగలరు. ధరఖాస్తు చేసుకొనుటకు చివరి తేది. 27.03.2023 సాయంత్రం 5 వరకు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ధరఖాస్తు చేసుకొనేముందు వెబ్ సైట్ : http://sportsscholarship.ongc.co.in లోని నియమ నిబంధనలను చదివి ధరఖాస్తు చేసుకొనవలసినదిగా తెలియచేయసారు.
జాతీయ స్థాయి సీనియర్ మహిళల ఆంధ్రా కబడ్డీ జట్టు ఎంపిక :
ఔత్సాహికుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం:
హర్యాణలో జరిగే జాతీయ స్థాయి సీనియర్ మహిళల ఆంధ్రా కబడ్డీ జట్టు ఎంపిక కోసం మార్చి 18 ఆదివారం ఉదయం 9.00 గంటలకు బి.ఆర్.స్టేడియం గుంటూరు నందు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపియున్నారు.
కావున, తూర్పు గోదావరి జిల్లా కు చెందిన జిల్లాలోని ఆశక్తి గల 75 కిలోల లోపు బరువు గల కబడ్డి మహిళ క్రీడాకారులు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
addComments
Post a Comment