ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు.



ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు.


ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం, రాష్ట్రంలో విద్యారంగం అభివృద్దికి అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన సీఎం, ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు సీఎం అంగీకారం.


సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న సీఎం.


దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో తమ ట్రస్ట్‌కు 100 ఎకరాల భూమిని కేటాయించడంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్వామినారాయణ్‌ గురుకుల్‌ యూనివర్శిటీని ఏర్పాటుచేసి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు సీఎంకి వివరించిన ప్రతినిధుల బృందం.


శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ గ్రూప్‌కి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గడ్, రాజస్ధాన్, న్యూఢిల్లీ, యూఎస్‌ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలలో 52 కు పైగా విద్యాసంస్ధలు.


ఈ సమావేశంలో పాల్గొన్న ట్రస్టీ మెంబర్‌ సుఖ్‌వల్లభ్‌ స్వామి, విజయవాడ బ్రాంచ్‌ ఆర్గనైజర్‌ మంత్రస్వరూప్‌ స్వామి, ట్రస్ట్‌ సభ్యులు శ్రవణ్‌ప్రియ్‌ స్వామి, విషుద్జీవన్‌ స్వామి, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.

Comments