*వార్షిక బడ్జెట్లో చేనేతలకు ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి
*
- తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు
మంగళగిరి (ప్రజా అమరావతి);
రాష్ట్రంలోని చేనేత కార్మికులను చేనేత పరిశ్రమను నిట్ట నిలువునా మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నిన్న 16-3-2023 న శాసనసభలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన 2023- 24 వార్షిక బడ్జెట్లో 2 లక్షల 97 వేల 279 . 27 కోట్లు కేటాయించి అందులో రాష్ట్ర జనాభాలో 11 శాతం గా ఉన్న చేనేత వారికి తీవ్ర అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు అన్నారు.
మంగళగిరి శ్రామిక నగర్ లోని మగ్గల షెడ్ లో పనిచేస్తున్న చేనేత కార్మికుల తో కలిసి మాట్లాడుతూ... రాష్ట్రంలో చేనేత జనాభా 65 లక్షల మంది ఉండగా మూడు లక్షల చేనేత మగ్గాల పై సుమారు 15 లక్షల మంది జీవనం కొనసాగిస్తున్నారని వారి కోసం ఈ వార్షిక బడ్జెట్లో రెండు వందల కోట్లు కేటాయించటం జగన్మోహన్ రెడ్డికి చేనేత వారి పట్ల ఉన్న మమకారం ఏమిటో తెలుస్తోందన్నారు...
నేతన నేస్తం 24 వేల రూపాయలు ఇస్తున్నామన్న సాకుతో చేనేత వారిని మభ్య పెట్టాలని చూస్తున్నారని.. మీరు ఇస్తున్న చేనేత నేస్తం ఈ వృత్తిలో కొనసాగుతున్న 10 శాతం మంది కూడా అందటం లేదన్నారు.
చేనేత ముడి సరుకులైన నూలు, రంగులు రసాయనాలపై ప్రభుత్వ సబ్సిడీ లపై కేటాయింపులు చేయలేదని, చేనేత సొసైటీ కార్మికుల కోసం సబ్సిడీ రూపంలో అందించే పావలా వడ్డీ నూలు పై సబ్సిడీ , త్రిఫ్డ్ ఫండు పథకంపై ఎటువంటి ప్రస్తావన చేయలేదని విమర్శించారు..
నష్టాల్లో ఉన్న ఆప్కో కు గ్రాంటు ఏ రూపంలో మంజూరు చేస్తున్నారో తెలపలేదన్నారు. ఆర్భాటంగా చేనేత కులాలకు కార్పొరేషన్ల పేరిట పదవులు ఇచ్చి ఆయా కార్పొరేషన్లకు వంద రూపాయలు కూడా నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు....
తక్షణం నేతన్న నేస్తం పథకాన్ని పూర్తిస్థాయిలో రాష్ట్రంలోని చేనేత కార్మికులు, అనుబంధ వృత్తిదారులందరికీ వర్తింపజేయాలని అందుకు గాను బడ్జెట్ ను సవరించి చేనేతకు ఐదువేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో నియోజవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు, ఇమంది రాజారావు, నాగులపల్లి వెంకన్న, మారవుతు రమణ, ఈశ్వరరావు, ముగ్గుల సత్యనారాయణ, కొలికాన సూర్య కళ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment