యువత భవిత దిశగా కొత్త పాలిటెక్నిక్ కాలేజీలను మంజూరు చేసిన సీఎం.

 




*యువత భవిత దిశగా కొత్త పాలిటెక్నిక్ కాలేజీలను మంజూరు చేసిన సీఎం*


*నంద్యాల జిల్లాలోని బేతంచెర్లకు ఓ కాలేజ్ కేటాయించడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హర్షం*


*రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీల స్థాపనకై ఉత్తర్వులు జారీ*


అమరావతి, మార్చి, 20 (ప్రజా అమరావతి): యువతకు మంచి భవిష్యత్ ను అందించాలనే ఆలోచనలను ఆచరణలో పెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 కోట్లతో  3  పాలిటెక్నిక్ కాలేజీలను మంజూరు చేసిందని ఆర్థిక, నైపుణ్య, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లాలోని గుంతకల్, వైఎస్ఆర్ కడప జిల్లాలోని మైదుకూరు ప్రాంతాలలో పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్..  మార్చి 20వతేదీ సోమవారం గెజిట్ విడుదల చేశారు.  


యువతకు చక్కని ఉపాధి అవకాశాలకు ఆస్కారముండే సాంకేతిక విద్యనందించే పాలిటెక్నిక్ కాలేజీలను మంజూరు చేయడం పట్ల ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హర్షం వ్యక్తం చేశారు. కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ,సివిల్, కెమికల్, మెటలార్జికల్ రంగాలలో డిప్లొమా  కోర్సుల కోసం సుదూరాలు వెళ్ళకుండా చదువుకునేలా   గ్రామీణ యువతకు మరింత వెసులుబాటు ఉంటుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య, శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తవగానే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. మంజూరైన 3 పాలిటెక్నిక్ కాలేజీలలో ఒకటి తన సొంత నియోజకవర్గం డోన్ లోని బేతంచెర్లలో రూ.30కోట్లతో ఏర్పాటవనుండడం పట్ల నియోజకవర్గం, జిల్లా యువతీయువకుల తరపున మంత్రి బుగ్గన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.  యువతీయువకులు మెరుగైన అవకాశాలు అందించే దిశగా 3 కాలేజీలను వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికే కేటాయించడాన్ని మంత్రి బుగ్గన అభినందించారు.



Comments