ప్రజలిచ్చిన తీర్పు మామూలు తీర్పుకాదు.

 అమరావతి/మంగళగిరి (ప్రజా అమరావతి);


తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నేతలు.


ఉగాది వేడుకల్లో పంచాంగ పఠనం చేసిన పులుపుల వెంకట ఫణి కుమార్ శర్మ.


- తెలుగు ప్రజలకు ఉగాది శుభాక్షాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.


కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ప్రసంగం వివరాలు...


 తెలుగుప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.


 ఉగాది పండుగతో తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. 


 ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉభయతెలుగురాష్ట్రాల్లోని తెలుగువారితోపాటు, ప్రపంచంలోని తెలుగువారందరికీ నా హృదయపూర్వక ఉగాదిశుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 


 బ్రహ్మశ్రీ పులుపుల వెంకటఫణికుమార్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. 


 ఆరు రుచుల సమ్మిళి తమైన ఉగాదిపచ్చడి ద్వారా నూతన తెలుగుసంవత్సరాన్ని ప్రారంభిస్తాము. 


 కష్టాలు,సుఖాలు, ఇబ్బందులు, బాధలు అన్నీ జీవితంలో ఉంటాయి. 


 వాటన్నింటి కలబోతల రూపమే జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలు... అనుభవాలు అని చెప్పేందుకే ఆరు రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు. 


 రాబోయేరోజులు ఎలాఉండబోతున్నాయో ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పుద్వారా ముందేచెప్పారు. 


 ప్రజలిచ్చిన తీర్పు మామూలు తీర్పుకాదు. 



 ఎన్నిసమస్యలు సృష్టించినా, భయపెట్టినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటుచేశారు. 


 ప్రజాపాలనలో ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవాల్సిన వారు నియంత్రత్వ పాలన సాగిస్తున్నారు.


 భాధ్యతతో ప్రవర్తించకుండా, బరితెగించి వ్యవహరిస్తున్నారు. 


 ఇక అలాంటి వారి ఆటలు సాగవని ప్రజలు చాటిచెప్పారు.


 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా బాగావర్షాలుపడి, రైతులఆదాయం పెరిగి, కుటుంబాలతో వారు సంతోషంగా, సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 


 రాష్ట్రప్రభుత్వ పన్నులభారం, పెరిగినధరలతో ప్రజలు ఇప్పటికే కష్టాలుపడుతున్నారు. 


 పంచాంగలో మరలా ఈ సంవత్సరంకూడా ధరలు పెరుగుతాయని చెప్పారు. దీనిపై మనం పాలకుల్ని నిలదీయాలి, ప్రజలకు అండగాఉండాలి. 


 పంచాంగం అనేది శాస్త్రోక్తంగా జరిపేప్రక్రియ. దాన్నిమనం నమ్మాల్సిందే. 


 తెలుగుజాతి అనేకరంగాల్లో ఉన్నతస్థానాల్లో ఉంది.


 ప్రపంచంలో ఏదేశానికి వెళ్లినా తెలుగువారు బ్రహ్మండంగా రాణిస్తున్నారు. 


 ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 


 ఈ సందర్భంగా పార్టీనేలతో కలిసి చంద్రబాబు నాయుడు ఉగాది పచ్చడి తీసుకున్నారు. 


 పంచాంగ పఠనం చేసిన వెంకట ఫని కుమార్ తెలుగు దేశం పార్టీకి రానున్న రోజుల్లో శుభం జరగుతుందని తెలిపారు. 


 ఈ కార్యక్రమంలో భాగంగా పంచాంగ పఠనం చేసిన పులపుల వెంకటఫణికుమార్ శర్మను, ఇతర పండితులను చంద్రబాబు సత్కరించారు.

Comments