ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారుల్నికూడా జగన్ పార్టనర్స్ ఇన్ క్రైమ్ గా మారుస్తున్నా డు.

                                                                                                                                                                                               *తెలుగుదేశం పార్టీ కేంద్రకార్యాలయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్థులు.* 


*వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, రామగోపాల్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపి అభినందించిన చంద్రబాబు నాయుడు.*


*కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు.*

అమరావతి (ప్రజా అమరావతి);

   *సమావేశంలో చంద్రబాబునాయుడిగారి ప్రసంగం:-*


•ఎమ్మెల్సీలుగా గెలిచిన అభ్యర్ధుల్ని, వారిగెలుపుకోసం పనిచేసిన ప్రతిఒక్కరినీ పేరుపేరునా అభినందించిన చంద్రబాబు నాయుడు

•ఉన్నత విద్యావంతుడైన చిరంజీవి రావు మంచి అభ్యర్థి అవుతారు అని అంతా చెప్పారు. అతను ఎకానమిస్ట్ చిరంజీవిగా ప్రజలకు సుప్రసిద్ధుడు. వందలాదివిద్యార్థుల్ని ఉన్నతస్థానా లకు పంపాడు. 

•  ఎమ్మెల్సీఅభ్యర్థిగా ప్రకటించిన 25 రోజుల్లోనే ఆయన తనశక్తి ఏంటో నిరూపించుకున్నారు. 

• కంచర్ల శ్రీకాంత్ విజయంతో ఎమోషనల్ అయ్యాడు

• శ్రీకాంత్ కష్టానికి ఈ రోజు గొప్పఫలితం దక్కింది. 

• అభ్యర్థుల గెలుపులో భాగస్వాములైన వారి కుటుంబసభ్యుల్ని, అనుచరుల్ని మనస్ఫూ ర్తిగా అభినందిస్తున్నాను. 

• రాంగోపాల్ రెడ్డి నీవు చేయగలవా అని అడిగినప్పుడు “కష్టపడతాను, అవకాశమివ్వండి”  అన్నాడు...మాటనిలబెట్టుకొని చేసి చూపించాడు.

• రాంగోపాల్ పులివెందుల బిడ్డ పులివెందుల పులిగామారాడు...టీడీపీ గెలుపుతో జగన్ పులివెందుల పిల్లి అయ్యాడు.

• పులివెందులలో రౌడీయిజాన్ని రాంగోపాల్ రెడ్డి గట్టిగా ఎదిరించాడు.

ఒక బూత్ లో వైసీపీవాళ్లు రిగ్గింగ్ చేస్తుంటే వారిని లాగిబయటపడేశాడు. దాంతో యువతలో ఆయనపై సదభిప్రాయం ఏర్పడింది. 

•ఈ ఎన్నికల ద్వారా పులివెందులలో రాంగోపాల్ రెడ్డి గెలిచాడు...జగన్ ఓడిపోయాడు.

• ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారుల్నికూడా జగన్  పార్టనర్స్ ఇన్ క్రైమ్ గా మారుస్తున్నా డు.


• ఎన్నికల డ్యూటీలో ఉండే ఆర్వో, ఎస్పీలతో తప్పులు చేయించే ప్రయత్నం చేశారు.

• గెలుపు ప్రకటించిన తరువాత బుద్ది లేకుండా రీ కౌంటింగ్ అడిగారు. వైసీపీ అభ్యర్థి రవీంద్ర రెడ్డి టీడీపీవారికి  కంగ్రాట్స్ చెప్పి, వెళ్లిపోతే జగన్ వెనక్కు రప్పించాడు. 

•   అధికారులపై ఒత్తిడి తెచ్చి డిక్లరేషన్ ఇవ్వకుండా చేశారు. రామ్ గోపాల్ రెడ్డి గెలిచాడని చెప్పారు కదా.. బాగా రాత్రయింది వెళ్లిపోతామన్నారు, అక్కడున్నవాళ్లంతా. మీరు వెళ్లిపోతే, తెల్లారేసరికి వైసీపీఅభ్యర్థి గెలిచాడని ప్రకటిస్తారు అనిచెప్పాను.   

• డిక్లరేషన్ ఇచ్చేవరకు తగ్గేది లేదని పట్టుబట్టి సర్టిఫికెట్ తీసుకున్నాం. ఎన్నికలకమిషన్ ఆదేశాలుకూడా పాటించనీయకుండా అర్వోను, కలెక్టర్ని అడ్డుకున్న జగన్ సైకో కాడా?

నమ్ముకున్నవాళ్లందరినీ జైలుపాలుచేశాడు..చేస్తాడుకూడా.   

• 72 గంటల పాటు నాయకులు, కార్యకర్తలు నిర్విరామ పోరాటం చేశారు.

• గెలిచిన వ్యక్తిని అరెస్టు చేసి తరలించడం చూసి ప్రజాస్వామ్యం ఉందా అనుకున్నా.

• ఎన్నికల కమిషన్ నియామకంపై సుప్రీం కోర్టు చెప్పిన కొత్త విధానం అమల్లోకి రావాలి.

• ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి జగన్ వారిని తన క్రైంలో భాగస్వాములు చేస్తున్నాడు.

• గోదావరి జిల్లాల్లో ఇసుకమాఫియాలో భాగమైన ప్రేమ్ రాజ్ అనే వ్యక్తి, వైసీపీనేతల ఒత్తిళ్లు తట్టుకోలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.

• ఒక నెలకు చెల్లించాల్సిన 21 కోట్ల రూపాయలు చెల్లించలేదని అతనిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది పార్టనర్స్ ఇన్ కరెప్షన్.


• జీవో నెంబర్ 1 తీసుకువచ్చిన ప్రభుత్వానికి సిగ్గు, బుద్ధి ఉన్నాయా?  ప్రతిపక్షాలను కట్టడి చేసే ప్రయత్నంచేస్తున్నారు. ప్రజలగొంతు నొక్కేస్తున్నారు.

• 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలోగానీ, రాష్ట్రచరిత్రలోగానీ ఇలాంటి జీవోలు ఎవరూ తేలేదు.

• రాష్ట్ర విభజన సమయంలో పెద్దఎత్తున గొడవలు జరిగాయి....జనం విడిపోయారు. అయితే అంత ఆవేశాలు ఉన్న ఆ సభలో కూడా సభ్యులపై దాడులు జరగలేదు. 

• పరిటాల రవిని హత్యచేసినప్పుడు, యల్లంపల్లి లిఫ్ట్ వచ్చిన సమయంలో రోజుల తరబడి సభలో చర్చలు జరిగాయి. అధికార, ప్రతిపక్షసభ్యులు హోరాహోరీగా పోరాడారు. 

• సభలో వెంకయ్యనాయుడు, పుచ్చలపల్లి సుందరయ్య కఠినంగా మాట్లాడేవారు. వారు అలా మాట్లాడినప్పుడు స్పీకర్ తనహుందాతనం కోల్పోలేదు. 


*నేడుశాసనసభలో మా సోదరుడు బాలవీరాంజనేయస్వామిపై జరిగిన దాడికి చాలా బాధప డుతున్నాను. మా ఎమ్మెల్యేని కొట్టిన వారిని మరలా అసెంబ్లీలో అడుగుపెట్టనీయం.*  

• ఈ రోజుసభలో ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై దాడిచేయడం దారుణం. మీరే దాడిచేసి, మీరే డ్రామాలు ఆడుతారా? కోడికత్తిడ్రామా, బాబాయ్ హత్యడ్రామాల్లాగా. 

• ప్రజలతిరుగుబాటుతోనే సైకోలు చట్టసభల్లోకి రాకుండా పోతారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీవైపు వీచింది చిన్నగాలే. రేపు రాబోయే సునామీతో వైసీపీ, జగన్ కొట్టుకుపోవడం ఖాయం. 

• అసెంబ్లీ గౌరవసభకాదు..కౌరవ సభఅని ఏనాడోచెప్పాను. దళితఎమ్మెల్యే అని మాస్వామిపై దాడిచేసి, అతనికి కనీసం క్షమాపణకూడా చెప్పరా? ఎవరైనా సభలో పొరపాటుచేస్తే అక్కడుండే పెద్దలు ఇరుపక్షాలతో మాట్లాడి సర్దుబాటు చేస్తారు. 

• తాను, జగన్ ఎవరం శాశ్వతంకాదు. అసెంబ్లీ శాశ్వతం.  ఈ రోజు సభలో జరిగిన సంఘటన ఒక చీకటిఘట్టంగా, ఈరోజు చీకటిరోజుగా మిగిలిపోతుంది. అదేనా బాధ.

• ఎమ్మెల్యే స్వామిపై దాడి చేసి...తిరిగి మళ్లీ ఆయనపై, మాపార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్నారు. మీరు 151 మంది ఉంటే మమ్మల్నిచంపేస్తారా? మేం రోడ్లపైకి వస్తే పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరని గుర్తుంచుకోండి. 

• మీరుబెదిరిస్తే ఎవరూభయపడరు. హుందాగా ఉండటం నేర్చుకోమని ముఖ్యమం త్రిని హెచ్చరిస్తున్నాం. 

• రాష్ట్రంలో ఒక సైకో గా ఉన్న సిఎం...వందల మంది సైకోలను తయారు చేశాడు.

• ఇలాంటివాటికి విసుగుచెందే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనంతీర్పు చెప్పారు.

• నిన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు చిన్న గాలి మాత్రమే....రానున్న రోజుల్లో సునామీ వైసీపీని ముంచేస్తుంది.

• ఇది గౌరవ సభకాదు...కౌరవ సభ అని నేను అన్నాను. నేడు అదే సభలో దళితుడైన స్వామిపై దాడి చేశారు.

• ఎప్పుడైనా సభలో పొరపాటు జరిగితే వెంటనే విచారం వ్యక్తంచేస్తారు. కానీ వైసీపీ అందుకు భిన్నంగా వ్యవహరించింది.

• పనికిమాలిన వ్యక్తులు నాయకులుగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలే జరుగుతాయి.

• విభజన బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా ఈ స్థాయి ఘటనలు జరగలేదు.

• ఈ రోజు హెచ్చరిస్తున్నా...మీ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడ లేరు

• మీరు బెదిరిస్తే మేం పారిపోతాం అనుకుంటున్నారా....లేదు బట్టలిప్పిస్తా

• ఎన్నో సంక్షోభాలు చూశాం...అన్నిటికీ సమాధానం చెపుతాం

• స్పీకర్ నిస్సహాయుడా....ఎందుకు స్పందించలేదు. 

• ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడితే స్వామిపై దాడి జరిగింది. స్వామి పోరాటం వృథా కాదు.

• జీవో-1 రద్దు అయ్యేవరకు తెలుగుదేశం పోరాడతుంది. స్వామిపై దాడిచేసిన ఎమ్మెల్యేలు మళ్లీ అసెం బ్లీకి రాకుండా చేస్తాం. ప్రజలమద్దతుతో బుద్ధిచెపుతాం.

• జీవో నెంబర్ రద్దుతో పాటు.....ఎమ్మెల్యేలపై దాడి విషయాన్ని విస్తృతపర్యటన ద్వారా ప్రజలకు చాటిచెపుతాం.

• ఈ ప్రభుత్వంతో తాడోపేడే తేల్చుకుంటాం.

• ఎమ్మెల్సీ ఎన్నికలగెలుపుపై సంబరాలు చేసుకోవాలి అనుకుంటుంటే....ఇలా అసెంబ్లీలో దాడులు చేస్తారా? 

• ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల అన్ని వర్గాలు భయపడుతున్నారు. కానీ ఎన్ని ఉన్నా ప్రాణ త్యాగాలు చేసి అయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం.

• దీనికోసం త్యాగాలు చేసిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నాను

• ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆరంభమే.... భవిష్యత్ లో వచ్చేది సునామీనే.

• జగన్ లాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. వైసీపీలాంటి పార్టీకి ప్రజాస్వామ్యంలో కొనసాగే అర్హత లేదు.

• వైఎస్ఆర్ తో కూడా నాడు హోరాహోరీగా పోరాడాం. అయితే అంశాన్ని బట్టి వైఎస్ఆర్ తగ్గేవాడు. చూసి వ్యవహరించేవాడు. ఎందుకంటే ప్రజలకోసం. 

• మా ఎమ్మెల్యే, మా సోదరుడు స్వామిపై దెబ్బ పడకుండా కాపాడుకోలేకపోయాను అనే బాధ నాకుఎప్పుడూ ఉంటుంది.

• నాకు ఎప్పుడూ ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలురాలేదు. ప్రతిపక్ష సభ్యుల్ని కొట్టించడం ఏమిటి? 

•స్వయంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేపై దాడిజరుగుతుంటే...ఇక లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నట్టు? 

• మీరేకొట్టి, మీరే సస్పెండ్ చేస్తే, మేం భయపడి పారిపోవాలా? ప్రజలకోసం ఎన్ని అవమానా లు,కష్టాలు అయినా ఎదుర్కొంటాం. 

• ఎన్నిసవాళ్లు వచ్చినా రాష్ట్రం కోసం, ప్రజలకోసం పట్టుదలగా నిలబడతాం.

• ప్రజలకోసం, రాష్ట్రం కోసం టీడీపీ పనిచేస్తుంది. పార్టీనాయకుల్ని, కార్యకర్తల్ని రక్షించుకో గలుగుతున్నాం కానీ, ప్రజలు మాత్రం ఇంకా జగన్ కు భయపడుతున్నారు. 

• ముగ్గురు ఎమ్మెల్సీలు మూడుచరిత్రలు. వారు నేనుచెప్పిందానికంటే ఒక అడుగు ముందు కే వేశారుగానీ, వెనకడుగు వేయలేదు.

• రాష్ట్రానికి ద్రోహంచేసే వైసీపీ గెలవడానిక వీల్లేదని, అన్నిపార్టీలు కలిసిరావాలని కోరాం. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు సహకరించిన పీడీఎఫ్, సీపీఎం, సీపీఐ, జనసేన వారిని, గ్రాడ్యుయేట్ ఓటర్లను పేరుపేరునా అభినందిస్తున్నా.   

• ఈ ఎమ్మెల్సీల పోరాటాన్ని, పార్టీఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.

Comments