*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా.
విజయవాడ (ప్రజా అమరావతి);
*స్టెమ్, స్మార్ట్ స్కూల్ ప్రాజెక్టు ద్వారా వినూత్న బోధన అందించాలి
*
• పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు
• సేవ్ ది చిల్డ్రన్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు, సన్ ఫౌండేషన్, సన్ టివి నెట్వర్క్ సంస్థలను అభినందించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు
పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో సేవ్ ది చిల్డ్రన్ సంస్థ పాఠశాల విద్యలో కొత్త ఒరవడి దిద్దేందుకు స్టెమ్ (Science, technology, engineering, mathematics), డిజిటల్ విధానం ద్వారా నాణ్యమైన విద్యను అందించడానికి విశేష కృషి చేస్తోందని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. బుధవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సేవ్ ది చిల్డ్రన్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు, సన్ ఫౌండేషన్, సన్ టీవీ నెట్వర్క్ సంస్థలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ... పిల్లలకు అనుభవాత్మక విద్యను అందించడానికి ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ లను రూపొందించి మన రాష్ట్రంలో 81 మోడల్ స్కూళ్లలో, 117 జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో సేవ్ ది చిల్డ్రన్ స్టెమ్, స్మార్ట్ లాబొరేటరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వీటిని ఉపాధ్యాయులు, విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. సేవ్ ది చిల్డ్రన్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం పిల్లలకు ఎంతో ఉపయోగమని దీని ద్వారా సైన్స్ , మ్యాథ్స్, ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధించగలరని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేసిన సేవ్ ది చిల్డ్రన్, ఆర్థిక సహకారం అందించిన హెచ్.డి.ఎఫ్.సి, సన్ నెట్వర్క్, సన్ ఫౌండేషన్ లను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా సేవ్ ది చిల్డ్రన్ చేపడుతున్న కార్యక్రమాల బ్రోచర్ ఆవిష్కరించారు.
స్టెమ్, స్మార్ట్ లాబొరేటరీలను ఏర్పాటు కోసం 23 జిల్లాల్లో 101 పాఠశాలలకు హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు ఆర్థిక సాయం అందించగా, కడప, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సన్ ఫౌండేషన్ & సన్ నెట్వర్క్ ద్వారా 97 పాఠశాలలకు ఆర్థికసాయం అందించిందని రాష్ట్రంలో స్టెమ్, స్మార్ట్ స్కూల్ అమలు, ప్రగతి గురించి వివరిస్తూ సేవ్ ది చిల్ర్డన్ ప్రతినిధులు తెలిపారు.
ఈ సమావేశంలో సమగ్ర శిక్షా ఎస్ఏపీడీ శ్రీ బి.శ్రీనివాసరావు , కేజీబీవీ కార్యదర్శి శ్రీ డి. మధుసూదనరావు , మోడల్ స్కూల్ సెక్రటరీ శ్రీ కె.వి. కృష్ణారెడ్డి , ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణ సంచాలకులు శ్రీ కె.రవీంద్రనాథ్ రెడ్డి , హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు నుండి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శంకర్ ముత్యం, డిప్యూటీ వైస్ ప్రెసిడెట్ శ్రీ వెంకట రాజేష్, , అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వినాయక్, సేవ్ ది చిల్డ్రన్ ప్రతినిధులు శ్రీమతి ప్రశాంతి బత్తిన (సీనియర్ మేనేజర్, ఆంధ్ర -తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి), శ్రీనగేష్ మల్లాడి (ఎడ్యుకేషన్ లీడ్ , సౌత్ ఇండియా), శ్రీ రమేష్ దొంత (ప్రాజెక్ట్ లీడ్), శ్రీ సుధీర్ (, ప్రోగ్రాం ప్రతినిధి) చక్రపాణి(ప్రాజెక్ట్ లీడ్) , ఉపాధ్యాయులు, జిల్లా సైన్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment