శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు బుద్దా రాంబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వీరికి అమ్మవారి దర్శనం కల్పించారు.
అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు వీరికి శ్రీఅమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము అందజేసినారు.
addComments
Post a Comment