భూస్వాములపై పోరాడి విజయం సాధించిన వీరులు ఉన్న నేల మన తంబళ్లపల్లె.

 తంబళ్లపల్లె నియోజకవర్గం (ప్రజా అమరావతి);


మొలకలచెరువు బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడతు.


భూమి కోసం, విముక్తి కోసం పెత్తందారులు, భూస్వాములపై పోరాడి విజయం సాధించిన వీరులు ఉన్న నేల మన తంబళ్లపల్లె.


ఎంతో మహిమ ఉన్న

మల్లయ్య క్షేత్రం, చెన్నకేశవ స్వామి కొలువైన గడ్డ మన తంబళ్లపల్లె..

అటువంటి ప్రాంతంలో ఈరోజు పాదయాత్ర చేయడం, ప్రసంగించడం, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం ముగించడం నా అదృష్టం.

పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తో రాష్ట్రంలో సైకిల్ హవా మొదలైంది. జగన్ పని అయిపోయింది. రాబోయేది టిడిపి ప్రభుత్వమే.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజులు పర్యటించాను. 

14 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసాను. 577 కిలోమీటర్లు నడిచాను.  

ప్రజలు పడుతున్న బాధలు నేరుగా తెలుసుకున్నాను. 

ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక యువత హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వెళ్తున్నాం అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఉద్యోగాలు, ఉపాధి కల్పించలేని అసమర్ధ ముఖ్యమంత్రి మనకి అవసరమా?

ఒక తల్లి తన కూతురు గంజాయికి బానిస అయ్యింది. బయటకు పంపడానికి కూడా భయం వేసి ఇంట్లో పెట్టి తాళం వేసాను అని చెప్పినప్పుడు నాకు కన్నీరు ఆగలేదు. 

పన్నుల భారం, ఆకాశానికి చేరిన నిత్యావసర సరుకుల ధరలతో బ్రతకడం కష్టంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేసినప్పుడు పేదల రక్తాన్ని పీల్చే ముఖ్యమంత్రి మనకి అవసరమా అనిపించింది. 

మామిడి, చెరుకు, టమాటో, వేరు శనగ రైతుల పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసాను. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని రైతు వ్యతిరేక ప్రభుత్వం మనకి అవసరమా అనిపించింది.

బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో భేటీ అయ్యాను. వైసిపి పాలనలో  వాళ్ళు ఎదుర్కున్న వేధింపులు గురించి తెలుసుకున్న తరువాత మనం జగన్ పాలనా లో ఉన్నామా లేక తాలిబాన్ పాలనలో ఉన్నామా అనే డౌట్ వచ్చింది.

యువగళం పాదయాత్ర ను అడ్డుకోవడానికి జగన్ ఇంత మంది పోలీసుల్ని ఎందుకు పంపుతున్నారు అని నాకు అనుమానం వచ్చేది. 

ఉమ్మడి చిత్తూరు జిల్లా లో పర్యటన పూర్తయిన తరువాత నాకు సమాధానం దొరికింది. 

ప్రజాగళం బయటకి రాకూడదు అనే యువగళాన్ని ఆపాలని ప్రయత్నించారు. 

ఎంత మంది పోలీసుల్ని పంపినా నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్ని యువగళం పాదయాత్ర ద్వారా బయటకు వచ్చాయి.

బ్రదర్ జగన్ నువ్వు గట్టిగా అయితే నా పాదయాత్ర వెళ్లే దారిలో షాపులు మూయించగలవు ఏమో...యువగళం పాదయాత్ర కు రాకుండా జనాల్ని ఆపడం నీ తరం కాదు.

నేను ముందే చెప్పా సహకరిస్తే పాదయాత్ర...అడ్డుకుంటే దండయాత్ర.

పాదయాత్ర చేసిన జగన్ వేరు, సీఎం అయిన జగన్ వేరు. 

పాదయాత్ర లో జగన్ ఒక బిల్డప్ బాబాయ్. సీఎం జగన్ హింసించే పులకేశి. 

యువతకు బిల్డప్ బాబాయ్ బీభత్సమైన హామీలు ఇచ్చాడు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి ఏడాది 6,500 పోలీసు ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా డీఎస్సి. 

హింసించే పులకేశి చేసింది ఏంటి? ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా పిల్లలు చదువుకుంటే ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వాలో అని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎత్తేసాడు, ఎయిడెడ్ స్కూల్స్ నాశనం చేసాడు, పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కట్ చేసాడు, విదేశీ విద్య క్లోజ్ చేసాడు.

పాదయాత్ర చేసినప్పుడు మహిళలకు బిల్డప్ బాబాయ్ అనేక హామీలు ఇచ్చాడు. మద్యపాన నిషేధం, 45 ఏళ్లకే ఎస్సి,ఎస్టీ,బిసి, మైనార్టీ మహిళలకు పెన్షన్, దిశ చట్టం, ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తానని హామీ ఇచ్చాడు. 

హింసించే పులకేశి చేసింది ఏంటి? జే బ్రాండ్లు తెచ్చి మహిళల తాళిబొట్టు తాకట్టు పెట్టాడు. అమ్మఒడి ని అర్ధఒడి చేసాడు, పెన్షన్ మాటే లేదు. దిశ పేరుతో మోసం తప్ప చట్టం లేదు. 

పాదయాత్ర చేసినప్పుడు వృద్ధులకు బిల్డప్ బాబాయ్ 3 వేల పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చాడు. 

హింసించే పులకేశి చేసింది ఏంటి? 250 పెంచి ఒక్కో అవ్వాతాత దగ్గర 18000 కొట్టేసాడు. 6 లక్షల పెన్షన్లు కట్ చేసాడు.

పాదయాత్ర చేసినప్పుడు రైతులకు అనేక హామీలు ఇచ్చాడు బిల్డప్ బాబాయ్. రైతు రాజ్యం, 3500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, టమాటో రైతులకు కచప్ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజీలు అన్నాడు. 13,500 రైతు భరోసా అన్నాడు. 

హింసించే పులకేశి చేసింది ఏంటి రైతు భరోసా లో 6వేలు కట్ అంటే ఒక్కో రైతు నుండి 30 వేలు స్వాహా, డ్రిప్ ఇరిగేషన్ కి ఇచ్చిన సబ్సిడీ సున్నా? ఆఖరికి రైతుల మెడకు మీటర్ల రూపంలో ఉరి తాడు వేస్తున్నాడు.

ఉద్యోగస్తులకు, పోలీసులకు అనేక హామీలు ఇచ్చాడు బిల్డప్ బాబాయ్. వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు, పోలీసులకు అన్ని బెనిఫిట్స్ ఇస్తాం అన్నాడు. 

హింసించే పులకేశి చేసింది ఏంటి? ఒకటో తారీఖున జీతం ఇచ్చే దిక్కు లేదు. పోలీసులకు 4 సరెండర్స్ పెండింగ్ పెట్టాడు. 8 టిఏ,డిఏ లు పెండింగ్. 

ఎన్నికల ముందు బిల్డప్ బాబాయ్ అన్ని తగ్గించేస్తా అన్నాడు. 

హింసించే పులకేశి ఎం చేసాడు అన్ని పెంచుకుంటూపోయాడు. ఇసుక ధర, పెట్రోల్, డీజిల్ ధరల్లో దేశంలోనే నంబర్1, ఆర్టీసీ ఛార్జీల బాదుడు,ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకుల ధరలు ఇలా అన్ని పెంచుకుంటూ పోతున్నాడు.

ఎన్నికల ముందు మైనార్టీలకు బిల్డప్ బాబాయ్ అనేక హామీలు ఇచ్చాడు. ఇస్లామిక్ బ్యాంక్, దుల్హన్ లక్ష అన్నాడు. 

హింసించే పులకేశి చేసింది ఏంటి? మైనార్టీలను వేధిస్తున్నారు. 

అబ్దుల్ సలాం ని వెంటాడి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. 

స్కూల్ లో టాపర్ గా ఉన్న మిస్బా ని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.

బిల్డప్ బాబాయ్ దళితులకు అనేక హామీలు ఇచ్చాడు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నాడు. 

హింసించే పులకేశి దళితులకు కరెంట్ షాక్ ఇచ్చి పిచ్చోళ్ళు అనే ముద్ర వేస్తున్నాడు. 

దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తున్నాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు కి జగన్ సన్మానం చేసాడు.

దళిత డాక్టర్ సుధాకర్ గారిని వేధించి చంపేశారు. దళిత జడ్జ్ రామకృష్ణ గారిని వారి కుటుంబాన్ని వేధించి జైలుకి పంపారు. 

బిల్డప్ బాబాయ్ రాయలసీమ బిడ్డని అన్నాడు. 

హింసించే పులకేశి రాయలసీమ కు శని లా తయారయ్యాడు. 

రెండు సార్లు కడప ఉక్కు ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేసాడు. ముందు 20 వేల మందికి ఉద్యోగాలు అన్నాడు. ఇప్పుడు 6 వేల మందికి అంటున్నాడు. 

రెండు సార్లు చేసిన శంకుస్థాపన కోసం సొంత మీడియా కి 30 కోట్లు ప్రకటనలు ఇచ్చాడు. 30 పైసలు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఖర్చు చెయ్యలేదు.

అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది.

రిలయన్స్, అమరరాజా వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.

అన్నమయ్యా గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు.

హంద్రీనీవా, గాలేరు నగరి ఇలా టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. హింసించే పులకేశి 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే.

తంబళ్లపల్లె నియోజకవర్గంలో మూడు టీలు బాగా ఫేమస్ ఆ మూడు టీలు ఏంటో మీకు తెలుసా?

తంబళ్లపల్లె, తాగుబోతు ఎమ్మెల్యే, తాలిబాన్ పరిపాలన. 

మీ ఎమ్మెల్యే నాన్ లోకల్, ఎదో చేస్తాడు అని భారీ మెజారిటీతో గెలిపించారు. అయన మాత్రం నిత్యం తాగి తిరుగుతాడు.ఎక్కడ పడిపోతాడో తెలియదు. అలాంటి ఎమ్మెల్యే ఉండటం ప్రజలకు అవమానం. మీ ఎమ్మెల్యే కి జగన్ గారి జే బ్రాండ్లు అంటే భయం అందుకే నియోజకవర్గానికి వచ్చి కర్ణాటక బోర్డర్ కాబట్టి కర్ణాటక మద్యం తాగి సొంత ఊరు పుంగనూరుకి వెళ్ళిపోతారు. 

కురబలకోట మండలం అంగళ్లులో ద్వారకానాథరెడ్డి డీకేటీ, ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూములను 400 ఎకరాలు ఆక్రమించారు. వీటి విలువే 2వేల కోట్ల రూపాయలు. 

భూములు కొట్టేయడంలో తాగుబోతు ఎమ్మెల్యే ది డిఫరెంట్ స్టయిల్. ఆఖరికి రైతులను కూడా వదలడు. వీళ్ల అనుచరులే రైతుల మీద ఎదో ఒక కంప్లైంట్ ఇస్తారు. గతంలో ముదివేడు ఎస్సైగా గతంలో పనిచేసిన సుకుమార్ రెచ్చిపోయేవాడు. స్టేషన్ కి పిలిచి చిత్రహింసలు పెట్టి భూమి తాగుబోతు ఎమ్మెల్యే కి అమ్మాలి అని బెదిరించడం, వినకపోతే చిత్రహింసలు పెట్టడం. పోలీసుల సహకారంతో వేధించి 20 లక్షలు రేటు ఉన్న భూమిని రెండు మూడు లక్షలకు కొట్టేస్తారు. దీనికి నియోజకవర్గ ప్రజలు ముద్దుగా ఒక పేరు పెట్టారు ఆ పేరేంటో తెలుసా? 'బలవంతపు అంగీకార పత్రం'. ఇందులో వైకాపా నాయకులు కూడా బాధితులే.

కాండ్లమడుగు క్రాస్ నుంచి కంటేవారిపల్లెకు వెళ్లే దారిలో ఎమ్మెల్యే బావమరిది 25 ఎకరాల డీకేటీ, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అందులో గెస్ట్ హౌస్ కూడా కట్టారు. ఈ భూమి విలువ 10 కోట్ల రూపాయలు.

ములకలచెరువు ఎంపీడీవో ఆఫీస్ కు సమీపంలో ఎమ్మెల్యే 10 ఎకరాలు ఆక్రమించి లేఅవుట్ వేశారు ఈ భూమి విలువ ఐదు కోట్ల రూపాయలు.

ములకలచెరువు మండల కేంద్రంలో రోడ్డును ఆనుకుని ఉన్న 50 ఎకరాల డీకేటి, ప్రభుత్వ భూమిని ద్వారకానాథ రెడ్డి తన బినామీల పేరిట రాయించుకున్నారు.దీని విలువ 20 కోట్ల రూపాయలు.

తంబళ్లపల్లెలోని మల్లయ్య కొండ కింద రైతులకు చెందిన 82 ఎకరాల భూమిని ఎమ్మెల్యే బెదిరించి లాక్కున్నారు. రైతుల నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. ఇదే విషయమై రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అడిగితే ఆలయ అభివృద్ధి కోసం భూమిని తన బాబాయి కొన్నాడని చెప్పారు. భూములు లాక్కున్నది దేవుడు కోసమా?  లేదంటే మీ కుటుంబం కోసమా? అని తంబళ్లపల్లె ప్రజలు ఎవరిని అడిగినా చెబుతారు. ఒక్క తంబళ్లపల్లె మండలంలోనే ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి, ఆయన అనుచరులు 200 ఎకరాల భూమిని మింగేశారు. ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా?

పాపాఘ్ని నది నుంచి ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి, ఆయన అనుచరులు రోజుకు 100 టిప్పర్లలో ఇసుకను బెంగళూరుకు తరలించి పాపాఘ్ని నదిని దోచేశారు. ఒక్క ఇసుక ద్వారానే రోజుకు మీ ఎమ్మెల్యే కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. రెండేళ్లుగా భారీ వర్షాలు కురిసి మన ప్రాంతంలో పంటలు మునిగిపోయి రైతులు నష్టపోయారు. అదే వర్షాలకు పాపాఘ్ని నదిలో ఇసుక భారీగా చేరడంతో మీ ఎమ్మెల్యే దాన్ని అమ్ముకుని లాభపడ్డారు. రెండేళ్లలో ఇసుక పైనే 500 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు.

మల్లయ్య కొండను అభివృద్ధి చేస్తానంటూ పాత దేవుడి విగ్రహాన్ని ఏం చేశారనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలియలేదు. ఎమ్మెల్యే గారు మీరేమైనా చెబుతారా?  లేదంటే తాగిన మత్తులో ఎక్కడైనా విసిరేశారా?

తంబళ్లపల్లె నియోజకవర్గంలో రోడ్డు వేయాలన్న, విస్తరించాలన్నా, చిన్న గుంత పూడ్చాలన్నా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్సు సంస్థ తప్ప ఎవరూ చేయకూడదు.

తాగుబోతు ఎమ్మెల్యే  అక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే సాయంత్రానికి ఇంటి పైకి జేసీబీలను పంపి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రజలకు మీరు ఇచ్చిన బహుమతి ఇదా? 

కురబలకోట మండలం శీతివారిపల్లె వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన సొంత సంస్థ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఒక రిజర్వాయర్ నిర్మిస్తోంది. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వకుండా పనులు చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ మాత్రం పనులు పూర్తికాకుండానే చేసినట్టు రికార్డుల్లోకి ఎక్కిస్తూ సాధ్యమైనంత తొందరగా బిల్లులు తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే భూములు కోల్పోయిన రైతులందరికీ పరిహారం ఇస్తాం.

తాగుబోతు ఎమ్మెల్యే అక్రమాలను నిలదీసినందుకు దళిత జడ్జి రామకృష్ణ పై ఏకంగా దేశద్రోహం కేసు పెట్టించిన ఘనత పెద్దిరెడ్డి కుటుంబానిదే. రామకృష్ణ తమ్ముడు రామచంద్ర పై కూడా ద్వారకానాథరెడ్డి మనుషులు దాడి చేశారు.

తంబళ్లపల్లె నియోజకవర్గంలో పేదలకు పట్టెడం పెట్టాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలంట?  గతంలో ఎప్పుడైనా మనం ఇటువంటి పరిస్థితి చూశామా? 

ద్వారకానాథరెడ్డి అనుచరులు కర్ణాటక మద్యం, డీజిల్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

బతుకుదెరువు కరవై తంబళ్లపల్లె ప్రజలు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వెళ్లి భవన నిర్మాణ కార్మికులు, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డ్ లుగా పనిచేస్తున్నారు. కొందరైతే గల్ఫ్ దేశాలకు వెళ్లి మాయమవుతున్నారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. 

హంద్రీనీవా ద్వారా తంబళ్లపల్లెకు నీళ్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలకు హంద్రీనీవా కాలువకు గండ్లు పడ్డాయి. వాటి మరమ్మతులకు రెండు కోట్ల రూపాయలు అవసరమైతే ఆ నిధులను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో వైకాపా ఉంది.

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని రైతులు ఎక్కువమంది టమాటా పైనే ఆధారపడ్డారు. పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిని తప్పించడానికి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్లు, కెచప్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. 

తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు లాక్కున్న భూములు తిరిగి యజమానులకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఈ తాగుబోతు ఎమ్మెల్యేను జైలుకు పంపిస్తాం.

తాగుబోతు ఎమ్మెల్యే అరాచకాలకు వ్యతిరేకంగా తంబళ్లపల్లె జడ్పీటీసీ భర్త కొండ్రెడ్డి తెలుగుదేశంలో చేరారు. అందుకుగాను ఆయనపై అక్రమంగా కేసులు పెట్టించి జిల్లా నుంచే పోలీసులతో  బహిష్కరించారు. ఇన్ని అక్రమాలు చేసిన తాగుబోతు ఎమ్మెల్యే ని ఎం చేద్దాం. రాష్ట్ర బహిష్కరణ చేసి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం. 

ఉమ్మడి చిత్తూరు జిల్లా ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ పెద్ది రెడ్డి కుటుంబం. ల్యాండ్, స్యాండ్, మైన్, వైన్ మాఫియా అంతా ఆ కుటుంబానిదే. 

రోడ్లు వెయ్యాలన్నా, రిజర్వాయర్లు కట్టాలన్నా అన్ని పెద్దిరెడ్డి పిఎల్ఆర్ కంపెనీ మాత్రమే చెయ్యాలి. 

నాలుగేళ్లలో పెద్దిరెడ్డి కుటుంబం దోపిడీ ఎంతో తెలుసా 10 వేల కోట్లు. 

నేను ఛాలెంజ్ చేసా.. జిల్లాకి నేను తెచ్చిన కంపెనీల ముందు సెల్ఫీ దిగి మరీ ఛాలెంజ్ చేసా. టిసిఎల్, ఫ్యాక్స్ కాన్, డిక్సన్, సెల్కాన్, కార్బన్ ఇవన్నీ మేము తెచ్చిన కంపెనీ లు అని కాలర్ ఎగరేసి చెబుతున్నా.

హంద్రీనీవా, గాలేరు నగరి పనులు 90 శాతం పూర్తి చేసిన ఘనత మాది మీరు పీకింది ఏంటి మిగిలిన 10 శాతం పూర్తి చెయ్యాలనే చెత్త ప్రభుత్వం మీది. 

నాకు నోటీసులు ఇచ్చి బలవంతంగా బయటకి పంపి ఛాలెంజ్ మీకు గెలిచాం అంటున్నాడు పాపాల పెద్దిరెడ్డి. 

నీకు దమ్ము,దైర్యం ఉంటే మీ కుటుంబం చిత్తూరు జిల్లాకు ఎం చేసిందో ప్రెస్మీట్ పెట్టి చెప్పు. 

పెద్దిరెడ్డి కుటుంబాన్ని చిత్తూరు జిల్లా నుండి తరిమి కొడితేనే జిల్లా బాగుపడుంది. 

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కంపెనీలు రావాలి అన్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి అన్నా పెద్ది రెడ్డి కుటుంబానికి ప్రజలంతా బైబై చెప్పాలి. 

పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యం కోసమే మదనపల్లి ప్రత్యేక జిల్లా కాకుండా అడ్డుపడ్డాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లె కేంద్రంగా పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లెను కలిపి జిల్లా చేస్తాం.

ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు నాపై చూపించిన ప్రేమ, అభిమానాన్ని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. సహకరించిన మీడియా, పోలీసు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు.

Comments