*చంద్రబాబు, లోకేష్ స్కాంల్లో ఇదొకటి*
- *తవ్వితే మరెన్నో బయటపడతాయి*
- *ప్రజల సొమ్మును అడ్డంగా బొక్కేసి..మళ్ళా ప్రజల వద్దకు వస్తున్నారు*
- *స్కిల్ స్కామ్ లో సూత్రధారులు 'సీ' మెన్సే*
- *అబ్బా కొడుకులు కటకటాల పాలవ్వడం ఖాయం*
- *రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్*
రాజమండ్రి, మార్చి 22 (ప్రజా అమరావతి): తెలుగు నూతన సంవత్సరం శ్రీ శోభకృత్ మంచికి పట్టం, చెడ్డను అంతం చేసే న్యాయ దేవత మాదిరి నిలుస్తుందనే ఆశ కలుగుతోందని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రి ఎంపీ భరత్ ఆధ్వర్యంలో నగరంలోని ఏవీఏ రోడ్డు వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా గల విల్లా స్ట్రీట్ లో 'ఉగాది పురస్కారాలు' కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తామని, అందుకు గాను సీమెన్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అప్పట్లో ప్రకటించారని, ఇందు కోసం రూ.3,300 కోట్లు వెచ్చించనున్నట్టు చంద్రబాబు తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తుచేశారు. ఇందులో మన రాష్ట్రం పది శాతం, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ ఏర్పాటు చేస్తుందని తెలిపి, రూ.371.25 కోట్లు చంద్రబాబు మళ్ళించేశారని ఎంపీ భరత్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి కీలక పత్రాలు చంద్రబాబు మాయం చేశారన్నారు. ఎవరైతే చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెబుతున్నారో ఆ సీమెన్స్ యాజమాన్యం తామేమీ ఒప్పందం కుదుర్చోకోలేదని లిఖితపూర్వకంగా చెబుతుంటే..మరి ఆ రూ.371.25కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయో చంద్రబాబు, ఆయన సొంత పుత్రుడు లోకేష్ ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సొమ్మును నేరుగా రాష్ట్ర ఖజానా నుండి చంద్రబాబు తన సొంత జేబులో నుండి మళ్ళించేస్తే తెలియదా..ఎప్పటికైనా నిజం వెలుగు చూస్తుందనే విషయం తండ్రీ కొడుకులు విస్మరించారన్నారు. సీమెన్స్ అంటే చంద్రబాబు, ఆయన అనుచరులు అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్న చెప్పింది నూటికి నూరుపాళ్ళూ యదార్థమన్నారు. చంద్రబాబు, లోకేష్ స్కాంల్లో ఇదొకటి మాత్రమేనని, తవ్వేకొద్దీ మరెన్నో బయటపడతాయని ఎంపీ భరత్ అన్నారు. ప్రజల సొమ్మును అడ్డంగా బొక్కేసి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచేయడానికి తండ్రీ కొడుకులు సిద్ధపడుతున్నారని, వారి ఆటలు జగనన్న సాగనివ్వరని అన్నారు. యువగళం అంటూ గందరగోళం చేస్తున్న లోకేష్ కూడా తండ్రితో పాటు జైలు కెళ్ళడం ఖాయమని అన్నారు.
addComments
Post a Comment