ఎన్నికల నియమ నిభంధనల మేరకు విధులను నిర్వర్తించండి

 ఎన్నికల నియమ నిభంధనల మేరకు విధులను నిర్వర్తించండి


ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్



పుట్టపర్తి, మార్చి 07 (ప్రజా అమరావతి): పట్టభద్రులు , ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల నిర్వహణకు నియమ నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లు చేశామని జాయింట్ కలెక్టర్  టీఎస్ చేతన్ పేర్కొన్నారు 


మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి  శ్రీ సత్య సాయి జిల్లా, కడప,అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన జేసీలు, డీఆర్వోలు , నోడల్ అధికారులతో శాసనమండలి ఎన్నికల నిర్వహణకై ఏర్పాట్లపై అనంతపురం జిల్లా రిటర్నింగ్ అధికారి నాగ లక్షి వీసీ నిర్వహించారు.


ఈ విడియో కాన్ఫరెన్స్ కు పుట్టపర్తి కలెక్టరేట్లోని స్పందన వి సి హాల్ నుండి   జిల్లా సంయుక్త కలెక్టర్  టీఎస్ చైతన్, అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్,  డిఆర్వో  కొండయ్య,  పుట్టపర్తి ఆర్డీవో భాగ్య రేఖ, కదిరి ఆర్డీవో  రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ.. జిల్లాలో శాసన మండలి ఎన్నికలను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు.  మార్చి 10 తేదీన  రెండో విడత ఎన్నికల నిర్వహణపై పోలింగ్ అధికారులకు  మరో దఫా శిక్షణ ఇస్తున్నామన్నారు. పోలింగ్ సిబ్బందిని.. వారి సొంత మండలంలో కానీ, వారు విధులు నిర్వహించే మండలానికి కానీ.. ఎన్నికల విధులు కేటాయించలేదన్నారు. పోలింగ్ స్టేషన్లలో అవసరమైన అన్ని వసతులతో పాటు.. భద్రతగా ఏర్పాట్లను కూడా సంసిద్ధం చేసుకున్నామని తెలిపారు.  జిల్లా అంతట  పుట్టపర్తి లోని  చిన్న పల్లె  జడ్పీ హై స్కూల్ నందు  రిసెప్షన్ సెంటర్, ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు

ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన   మెటీరియల్ ప్రోక్యూర్మెంట్ సామాగ్రి ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. బ్యాలెట్ పత్రం,బ్యాలెట్  బాక్సుల నిర్వహణపై పివోలు,ఏపీవోలు,ఓపివోలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ కౌంటర్లు, నార్మల్,  సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు, తదితర ప్రాంతాలవద్ద నియమ నిబంధనల మేరకు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి వీడియోగ్రాఫర్, సూక్ష్మ పరిశీలకులను  నియమించామన్నారు.   ర్యాండమైజేషన్. పద్ధతి ద్వారా.. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల విధులను కేటాయించామన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ.. గతంలో నిర్వహించిన ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులందరికి కేటాయించామన్నారు. బ్యాలెట్ బాక్సులకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ కు వైట్, ఉపాధ్యాయులకు పింకు కలర్  క్లాత్ బాగ్ లు కేటాయించామని తెలిపారు.అలాగే అవసరమైన స్ట్రాంగ్ రూమ్ లు సిద్ధం చేసుకుని ఉన్నామని తెలిపారు.


అంతకు ముందు అనంతపురం ఆర్వో, కలెక్టర్ నాగలక్ష్మీ వీసి ద్వారా మాట్లాడుతూ..

ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాన్ పవర్, ట్రైనింగ్,మెటీరియల్ ,బ్యాలెట్ పేపర్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల ప్రొక్యూర్మెంట్ ,  ఎలెక్టోరల్ రోల్స్, మైక్రో అబ్జర్వర్స్, వెబ్ కాస్టింగ్ తదితర కార్యక్రమాలను పక్కా ప్రణాళికతో నిర్వహించాలన్నారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాల్లో క్షుణ్ణంగా వివరించాలన్నారు.


ఈ సమావేశంలో  డ్వామా  పిడీ రామాంజనేయులు, డిఆర్డీఏ పీడీ  నరసయ్య,,ఐ అండ్ పీర్ ఏడి  వేలాయుధం ,సిపిఓ  విజయ్ కుమార్,  హౌసింగ్ అధికారి  చంద్రమౌళి రెడ్డి, బ్యాలెట్ బాక్స్ నోడల్ అధికారి బాలాజీ,  ఎన్నికలకు సంబంధించిన  నోడల్ అధికారులు, పోలీస్ అధికారులు, కలెక్టరేట్ లోని అన్ని సెక్షన్ల సూపర్డెంట్లు, పుట్టపర్తి తాహెల్దార్, తదితరులు  హాజరయ్యారు.


Comments