*వైఎస్సార్ ఆసరా మూడవ విడత ప్రారంభం
*
*: జిల్లాలో 28,127 సంఘాలలోని 2,77,574 మంది సభ్యులకు రూ.216.55 కోట్ల లబ్ధి*
*: జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మార్చి 25 (ప్రజా అమరావతి):
ఏలూరు జిల్లా దెందులూరు నుంచి శనివారం వైఎస్సార్ ఆసరా పథకం కింద మూడవ విడత ఆర్థిక సహాయాన్ని అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
పుట్టపర్తి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ నళిని, పుడా వైస్ చైర్మన్ లక్ష్మీనరసమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీలక్ష్మి, డిఆర్డిఏ పిడి నరసయ్య, రంగే గౌడ మండల సమాఖ్య అధ్యక్షురాలు పుష్పలత, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 28,127 సంఘాలలోని 2,77,574 మంది సభ్యులకు రూ.216.55 కోట్ల లబ్ధి : జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా పథకం కింద మూడవ విడతలో భాగంగా జిల్లాలో 28,127 సంఘాలలోని 2,77,574 మంది సభ్యులకు రూ.216.55 కోట్ల లబ్ధి చేకూరడం జరిగిందని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆసరా పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల యొక్క ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడుతుందన్నారు. అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని రావడం జరిగిందన్నారు.
వైఎస్సార్ ఆసరా పథకం కింద 2020 సెప్టెంబర్ 11వ తేదీన మొదటి విడతలో భాగంగా జిల్లాలో 27,941 సంఘాల సభ్యులకు రూ.214.37 కోట్లు లబ్ధి చేకూరడం జరిగిందన్నారు. ఈ పథకం కింద రెండవ విడతలో భాగంగా 2021 అక్టోబర్ 7వ తేదీన జిల్లాలో 28,071 సంఘాల సభ్యులకు 217.11 కోట్ల రూపాయలు లబ్ధి కలిగిందన్నారు.
అక్క చెల్లెమ్మల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, వారి కుటుంబానికి సుస్థిరమైన ఆదాయం రావాలని, వారు సృష్టించుకునే వ్యాపార మరియు జీవనోపాధి అవకాశాలకు ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకొని వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహిళా సంఘాల సభ్యులకు రూ.216.55 కోట్ల మెగా చెక్కును పంపిణీ చేయడం జరిగింది.
addComments
Post a Comment