సిపిఎస్ రద్దు చేసే పోరాటానికి ఎర్రజెండాల మద్దతు

 సిపిఎస్ రద్దు చేసే పోరాటానికి  ఎర్రజెండాల మద్దతు         


    

  కాకినాడ, మార్చి9 (ప్రజా అమరావతి): సిపిఎస్ రద్దు కొరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో గురువారం కాకినాడలో స్థానిక ఇంద్ర పాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నాచేశారు. సిపిఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, డి ఏ ,ఇంక్రిమెంట్ ,బోనస్ మంజూరు చేయాలని, నెలవారి జీతాలు 1వ తేదీన మంజూరు చేయాలని వంటి నినాదాలు చేశారు. 

  ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బోడకొండ, సిపిఎం జిల్లా నాయకుల దువ్వా శేషుబాబ్జీలు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసే వరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి సిపిఐ, సిపిఎం మద్దతు ఉంటుందని, రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం కాకినాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేస్తున్నామన్నారు. 

ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి కేవలం ఉద్యోగుల ఉపాధ్యాయులే ప్రధాన కారణమని, బంపర్ మెజార్టీ ఉద్యోగులు ఇస్తే  వారి కోసం ఏం చేసావో బదులు చెప్పాలన్నారు. ఆయా జిల్లాల కలెక్టరేట్లు వద్ద తమ హక్కులపై ధర్నాలు చేసే అవకాశం లేకుండా పోలీసులతో నిరంకుశ పాలన సీఎం జగన్ చేస్తున్నారన్నారు. ఉద్యోగులపై వెట్టిచాకిరి విధానాలు అమలు చేస్తే సహించేది లేదని వారన్నారు.

  ఈ కార్యక్రమంలో పలివెల వీరబాబు తోకల ప్రసాద్, కెవిపిఎస్ నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జి లోవ రత్నం, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, కేశవరపు అప్పలరాజు, శాఖ రామకృష్ణ, నక్కా అప్పలకొండ, అన్నవరం సిపిఎం నాయకులు అజయ్ కుమార్, వీరబాబు, రాణి తదితరులు పాల్గొన్నారు.

Comments