పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదు..!



పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదు..!



జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జయప్రకాష్, ఎస్సి, బీసీ కార్పొరేషన్ల ఈడీలు డా. వెంకట సుబ్బయ్య, డా.వి. బ్రహ్మయ్యలు.


2022-23 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించి.."జగనన్న విద్యా దీవెన" లబ్ది మొత్తాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి.


జిల్లా వ్యాప్తంగా అర్హులయిన 46,134 మంది విద్యార్థులకు తల్లుల ఖాతాల్లో రూ.33.41 కోట్లు జమ.


కడప, మార్చి 19 (ప్రజా అమరావతి): పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఏ మాత్రం ఆర్థిక భారం కాకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని.. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జయప్రకాష్, ఎస్సి, బీసీ కార్పొరేషన్ల ఈడీలు డా. వెంకట సుబ్బయ్య, డా.వి. బ్రహ్మయ్య లు సంయుక్తంగా పేర్కొన్నారు. 


ఆదివారం ఎన్.టి.ఆర్. జిల్లా తిరువూరు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా.. 2022- 23 విద్యా సంవత్సరానికి సంబంధించి.. "జగనన్న విద్యా దీవెన" లబ్ది మొత్తాన్ని ల్యాప్ టాప్ బటన్ నొక్కి..  అర్హులయిన విద్యార్థుల తల్లుల ఖాతాలో జమచేయడం జరిగింది. 


ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్ విసి హాలు నుండి.. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జయప్రకాష్, ఎస్సి, బీసీ కార్పొరేషన్ల ఈడీలు డా. హెచ్. వెంకట సుబ్బయ్య, డా.వి. బ్రహ్మయ్యలు హాజరయ్యారు.


ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం...  2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 46,134 మంది విద్యార్థులకు మంజూరయిన "జగనన్న విద్యా దీవెన" లబ్ది మొత్తం రూ. 33,41,00,888ల మెగా చెక్కును.. విద్యార్థులు, వారి తల్లులకు.. గౌరవ అతిథుల చేతుల మీదుగా అందజేశారు. 


 అనంతరం.. కార్యక్రమానికి హాజరైన వారితో వారు మాట్లాడుతూ... దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి స్థాయి ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నారు. నిరుపేద విద్యార్థులకు సైతం.. ఉన్నత స్థాయి చదువులను చదివే అవకాశం ప్రభుత్వం కల్పించినందుకు... లబ్ది పొందిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు. "జగనన్న విద్యాదీవెన" అనే పథకం.. రాష్ట్రంలో ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, ఆపై స్థాయి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి ముఖ్యమంత్రి అందిస్తున్న సువర్ణావకాశం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్య దీవెన సాయం అందుకుని.. చదువుపై ఏకాగ్రతతో.. భవిష్యత్ లక్ష్యం పైపు అడుగులేయాని వారు ఆకాంక్షించారు. 


 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి "జగనన్న విద్యా దీవెన" పథకం ద్వారా.. జిల్లాకు మంజూరైన లబ్ది మొత్తం వివరాలు*


జిల్లాలో మొత్తం 46,134 మంది విద్యార్థుల  తల్లుల ఖాతాల్లో  రూ. 33,41,00,888 లు మంజూరైంది.


అందులో ఎస్సి సంక్షేమం కింద 8,123 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.7.15 కోట్లు విడుదలైందన్నారు.


ఎస్టి సంక్షేమం కింద 667 మంది విద్యార్థుల  తల్లుల ఖాతాల్లో రూ.37.29 లక్షలు విడుదలైందన్నారు.


 బిసి సంక్షేమం కింద 17,036 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10.82 కోట్లు విడుదలైందన్నారు.


 ఈబిసి కింద 8,869 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.8.06 కోట్లు విడుదలైందన్నారు.


కాపు సంక్షేమం కింద 5,845 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.3.93 కోట్లు విడుదలైందన్నారు.


ముస్లిం మైనారిటీ కింద 5,483 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.2.99 కోట్లు విడుదలైందన్నారు.


 క్రిస్టియన్ మైనారిటీ కింద 111 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.7.15 లక్షలు విడుదలైందన్నారు.


అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి విద్యా సంబందిత సంక్షేమ పథకాల ఫలాలు అందలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి. లక్ష్యం అని.. "జగనన్న విద్యా దీవెన" లబ్ధి పొందడంలో ఏవైనా సమస్యలు, అభ్యంతరాలు ఎదురయితే... సంబందిత సంక్షేమ శాఖల జిల్లా అధికారికి గానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వ కాల్ సెంటర్ నెంబర్ 1902 కు కాల్ చేయవచ్చన్నారు.


ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ, మైనారిటీస్, బీసీ, ఎస్సి, ఎస్టీ సంక్షేమ శాఖల  అధికారులు, విద్యాశాఖ అధికారులు, జిల్లాలోని పలు డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, నర్సింగ్ ఇతర ప్రొఫైషనల్ కోర్సుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. 


*** *పలువురు విద్యార్థుల అభిప్రాయాలు...*


1. *విద్యాదీవెన.. దేవుడిచ్చిన వారం..!*


రాష్ట్ర ప్రభుత్వం అందించే.. 'జగనన్న విద్యా దీవెన' పథకాన్ని దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాం. ఈ చివరి సంవత్సరంలో విద్యాదీవెన ద్వారా ఫీజు రీయింబర్స్ మెంట్ అమౌంట్ మా అమ్మ అకౌంట్లో జమ అయ్యింది. చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడే వారికి జగన్ సార్ అందిస్తున్న సాయం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాం. వసతి దీవెన కూడా పెండింగ్ లేకుండా అందుతోంది.


- లక్ష్మీ ప్రియ, డిగ్రీ ఫైనల్ ఇయర్, వివేకానంద ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, కడప 


2. *గతంలో ఎవరూ.. ఇంత గొప్పపని చేయలేదు..*


మాలాంటి వారికి ఉన్నత చదువులు చదువుకోవడానికి ముఖ్యమంత్రి కల్పిస్తున్న గొప్ప వరం. "జగనన్న విద్యా  దీవెన" ద్వారా ఆర్థిక సాయం అందడంతో.. మా తల్లిదండ్రులకు చదువు కోసం.. ఆర్థికావస్థ పడే భారం తగ్గింది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా.. ఇలాంటి గొప్పపని చేయలేదు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వమే అందిస్తుంది. సీఎం సార్ కు చాలా థ్యాంక్స్. 


- ఛార్మి, జి.ఎన్.ఎం., సోనియా నర్సింగ్ కాలేజ్, కడప


3. *మా ముఖ్యమంత్రి విద్యా ప్రదాత.!*


మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్య ప్రదాతగా.. ఆంధ్రరాష్ట్ర చరిత్రలోనే సుస్థిర స్థానాన్ని సంపాదించారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో.. "జగనన్న విద్యా దీవెన" అనే బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యకు అంత్యంత ప్రాధాన్యం ఇచ్చి.. పాఠశాలల్లో అధునాతన వసతులు కల్పించారు. చాలా గ్రేట్...


-పి.జ్యోతి, ఫస్ట్ ఇయర్, జి.ఎన్.ఎం., విజయదుర్గా నర్సింగ్ కాలేజ్, కడప.



Comments