సుపరిపాలన, స్వపరిపాలన వ్యవస్థకు నాంధి పలకడానికి పార్లమెంట్ వ్యవస్థ ఎంతో దోహదపడుతోంది


నెల్లూరు (ప్రజా అమరావతి);ప్రజాస్వామ్య వ్యవస్థను  బలోపేతం చేస్తూ   మనల్ని మనం పరిపాలించుకునే  సుపరిపాలన, స్వపరిపాలన వ్యవస్థకు నాంధి పలకడానికి పార్లమెంట్ వ్యవస్థ  ఎంతో దోహదపడుతోందని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు. 


మంగళ వారం ఉదయం   నెహ్రూ యువ కేంద్రం ఆద్వర్యంలో నగరంలోని టౌన్ హల్లో  జరిగిన మాక్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ, దేశంలోని  ప్రజాస్వామ్య వ్యవస్థను  బలోపేతం చేస్తూ   మనల్ని మనం పరిపాలించుకునే  సుపరిపాలన, స్వపరిపాలన వ్యవస్థకు నాంధి పలకడానికి పార్లమెంట్ వ్యవస్థ  ఎంతో దోహదపడుతోందని, ఈ అత్యున్నతమైన పార్లమెంట్ వ్యవస్థ గురించి యువత  తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం ఎంతో అవసరమన్నారు.  పార్లమెంట్ అంటే  ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాగే లోకసభ మరియు రాజ్యసభ అని, ఈ మూడు అత్యున్నతమైన  వ్యవస్థలు కలిపితే  అది ఇండియన్ పార్లమెంట్ అని అన్నారు.  ఈ వ్యవస్థ ఏర్పడిన నాటినుండి  పార్లమెంట్ ద్వారా అమలౌతున్న  చట్టాలన్నీ కూడా  ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశ అభివృద్దిలో భాగస్వాములు  అయ్యే విధంగా అమలు జరుగుచున్నాయన్నారు.  ప్రజాస్వామ్య వ్యవస్థలో  బాగస్వామ్యం, ప్రాతినిధ్యం ఈ రెండు చాలా ముఖ్యమన్నారు.   ఈ వ్యవస్థలపై యువతకు సంపూర్ణంగా అవగాహన కల్పించే లక్ష్యంతో మాక్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా  నిర్వహించడం జరుగుచున్నదన్నారు. పార్లమెంట్ వ్యవస్థలో అమలు జరుగుచున్న విధానపరమైన అంశాలను ప్రతి విధ్యార్ధి విద్యార్ధి దశ నుండే  గమనించడంతో పాటు అవగాహన కల్పించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో  గ్రామ స్థాయి నుండి   దేశ స్థాయి వరకు ఆయా చట్ట వ్యవస్థల ద్వారా  ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం జరుగుచున్నదని, వీటి పై యువత అవగాహన చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు.  వీటితో పాటు సామాజిక అంశాలపై  అవగాహన కలిగి  దేశం గర్వించదగిన విధంగా యువత మారాలన్నారు. 


అనంతరం విద్యార్ధులచే నిర్వహించిన ‘యూత్ పార్లమెంట్’ కార్యక్రమం ఎంతగానో  ఆకట్టుకుంది. 

తొలుత జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు,  స్వామి వివేకానంద గారి చిత్రా పటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

జిల్లా యూత్ అధికారి శ్రీ మహేంద్ర రెడ్డి,  సెట్నల్ సి.ఈ.ఓ శ్రీ పుల్లయ్య, కార్మిక శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీ వెంకటేశ్వర రావు, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ సురేశ్ కుమార్ ఈ కార్యక్రమంలో  పాల్గొని మాక్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఉద్దేశ్యాన్ని తెలియచేశారు. 

ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలకు చెంది  విద్యార్ధులు పాల్గొన్నారు. 

Comments