అంతర్జాతీయ మహిళా దినోత్సవం, హోళీ శుభాకాంక్షలు తెల్పిన పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా

 *అంతర్జాతీయ మహిళా దినోత్సవం, హోళీ శుభాకాంక్షలు తెల్పిన  పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా


*

                                                                                          

అమరావతి, మార్చి 7 (ప్రజా అమరావతి):    ఈ నెల 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు హోళీ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని మహిళలకు, ప్రజలకు రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యూత్ అడ్వాన్సుమెంట్ & సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా  శుభాకాంక్షలు తెలిపారు.  మంగళవారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ  మహిళా పక్షపాతి అయిన శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల  రాష్ట్రంలోని మహిళకు ఎప్పుడూ పండుగే అని ఆమె అన్నారు. రాష్ట్రంలోని మహిళలు అందరూ ఎంతో నమ్మకంతో, భరోసాతో చాలా సంతోషంగా ముందుకు వెళ్లడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు అన్ని రంగాల్లో ఎంతో ప్రాధాన్యత నిస్తూ వారు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని మహిళలను అందరినీ తమ కుటుంబ సభ్యులుగా, సొంత అక్కాచెల్లెళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి బావిస్తూ వారి అభ్యున్నతికి పలు అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఉన్నంత కాలం రాష్ట్రంలోని మహిళలకు ప్రతిరోజూ పండుగేనని ఆమె అన్నారు. 

                                                                                                                                                                                     

Comments