నెల్లూరు (ప్రజా అమరావతి);
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగు ప్రజలు ఒక రాష్ట్రంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంధి పలికారని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు అన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా గురువారం ఉదయం నగరంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద గల ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ గారు చూపించిన మార్గంలో అమరజీవి పోటీ శ్రీరాములు గారు పయనించి స్వాతంత్ర్య సమరంలో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగానికి ఫలితంగా దేశ వ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంధి పలికడం జరిగింద
న్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు మన జిల్లా వాసులు కావడం, ఆ మహనీయుని పేరుతో మన జిల్లాను పిలవబడటం మనందరికీ గర్వకారణమన్నారు. నేటి యువత ఆ మహనీయుని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత, నుడా ఛైర్మన్ శ్రీ ముక్కాల ద్వారాకానాథ్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment