గుంటూరు (ప్రజా అమరావతి); తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియా తో మాట్లాడతూ
టీడీపీ దళితశాసనసభ్యుడిపై అసెంబ్లీలో వైసీపీఎమ్మెల్యేలు దాడిచేస్తే, దాన్ని ఖండించాల్సిన జగన్మోహన్ రెడ్డి, అతనిప్రభుత్వతీరు మొగుణ్ణికొట్టి మొగసాలకెక్కిన పెళ్లాం మాదిరిగా ఉంది.
అసెంబ్లీ స్పీకర్ అధికారపార్టీకి, ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి, అతను అసమర్థుడుకాబట్టి, అతనిసమక్షంలో జరిగిన దాడిని బయటప్రపంచానికి తెలియకుండా చేయవచ్చన్నభావనతో దాడిచేశారు.
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
అనేచెప్పాలి.
కొన్నికోట్లరూపాయల ప్రజలసొమ్ముని దుర్వినియోగంచేస్తూ, శాసనసభనిర్వహణ పేరుతో సభలో ఇష్టానుసారం ప్రవర్తిస్తారా?
చంద్రబాబునాయుడు చేయని అవినీతిని చేశాడని ప్రజల్ని నమ్మించడానికి జగన్ ఇప్పటివరకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై 8సార్లు సమీక్షలుచేశాడు.
అవినీతికేసుల్లో జైలుకెళ్లివచ్చి, బెయిల్ పై ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నవ్యక్తి, చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.
రాష్ట్రరైతాంగం పంటలునష్టపోయి, అకాలవర్షాలధాటికి సర్వంకోల్పోతే, అసెంబ్లీలో ఒక్కనిమిషం కూడా ముఖ్యమంత్రి అన్నదాతల వెతలపై మాట్లాడలేదు.
ఎరువులు దొరక్క అవస్థలుపడుతున్న రైతులకష్టాలు ముఖ్యమంత్రికి కనిపించలేదు. రైతుభరోసా కేంద్రాలతోనే అంతా అయిపోతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పడం పచ్చిఅబద్ధం. రైతుభరోసాకేంద్రాలు..రైతుభక్షక కేంద్రాలుగా మారాయి.
నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి, బాధ్యతారాహిత్యంగా ఎదుటివారిపై నిందలేసి పబ్బంగడుపుకుంటున్నాడు.
రైతులసమస్యలు పట్టించుకోని ఏప్రభుత్వం మనగలిగిందిలేదు. జగన్మోహన్ రెడ్డి తక్షణమే అకాలవర్షాలకు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి.
పనిగట్టుకొని మరీ కావాలనే చంద్రబాబుపై అవినీతి ఆరోపణలుచేస్తూ, స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై పెద్దఉపన్యాసం ఇచ్చాడు.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతిజరిగితే, మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 90శాతం పెట్టుబడిపెట్టిన సీమెన్స్ సంస్థను ఎందుకు జగన్, అతని ప్రభుత్వం విచారించదు?
రాష్ట్రప్రభుత్వవాటాగా ప్రాజెక్ట్ కోసం కేవలం 10శాతం మాత్రమే నిధులు విడుదలచేసిన ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డిని సీఐడీ ఎందుకు విచారించదు?
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సీబీఐ చేసిన విచారణ తాలూకా వివరాలను జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటపెట్టడు?
సీమెన్స్ సంస్థతో గతంలో గుజరాత్ ప్రభుత్వంకూడా ఒప్పందంచేసుకుంది. ఆరాష్ట్రంలో ప్రాజెక్ట్ అమలుని పరిశీలించాకే టీడీపీప్రభుత్వం ఆసంస్థతో ఒప్పందంచేసుకుంది. జగన్ చెప్పినట్టుగా ఏపీప్రభుత్వం అవినీతికి పాల్పడితే, గుజరాత్ ప్రభుత్వంకూడా అవినీతిచేసిందా?
జగన్మోహన్ రెడ్డి, అతనిప్రభుత్వానికి వై.ఎస్.వివేకాహత్యకేసుతాలూకా రక్తపుమరకలు అంటాయి. హత్యకేసు ఎక్కడ తనకు, తనప్రభుత్వానికి మాయనిమచ్చలా మిగులుతుందోనన్నభయంతోనే జగన్, పనిగట్టుకొని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై పసలేని ఆరోపణలు చేస్తున్నాడు.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే అదేప్రాజెక్ట్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న నైపుణ్యశిక్షణాభివృద్ధికేంద్రాల్ని ప్రభుత్వం ఎందుకుకొనసాగిస్తోంది?
వాటిలోనే యువతకు శిక్షణఇస్తూ, అంతా మీరేచేస్తున్నట్టు ఏముఖంపెట్టుకొని గొప్పలు చెప్పుకుంటున్నారు?
మూడుఎమ్మెల్సీ స్థానాలు గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేకపోతున్నాడు. ఇప్పుటు టీడీపీసాధించిన విజయం తాత్కాలికమే. అసలు సునామీ ముందు ఉందని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం.
జగన్మోహన్ రెడ్డి తనభాష, పద్ధతి మార్చుకోకుంటే తీవ్రంగా నష్టపోతాడని హెచ్చరిస్తున్నాం.
addComments
Post a Comment