జిల్లాలో మాతా శిశు మరణాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలినెల్లూరు, మార్చి 7 (ప్రజా అమరావతి): జిల్లాలో మాతా శిశు మరణాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల


ని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో మాతా శిశు మరణాలపై జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో  జరిగిన మాతా శిశు మరణాలకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీలకు సంబంధించి మెరుగైన వైద్య సేవలు అందించాలని, నిరంతరం వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి అవసరమైన మందులను సకాలంలో అందజేయాలన్నారు. ప్రధానంగా హైరిస్క్ గల గర్భిణులను ముందుగానే గుర్తించి వారికి అవగాహన కల్పించి సురక్షితమైన ప్రసవం జరిగేలా వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు సమన్వయంతో పనిచేసే గర్భవతులకు సకాలంలో మందులు, వ్యాక్సిన్లు, పౌష్టికాహారం అందించాలన్నారు. గర్భిణీల ఆరోగ్య స్థితిగతులపై ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ విధులను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి పెంచలయ్య, డిసిహెచ్ఎస్ రమేష్ నాథ్, ఐసిడిఎస్ పీడీ సౌజన్య, డిపిహెచ్ఎన్ఓ భూలోకమ్మ, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


Comments