శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
గౌరవ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరియు దేవాదాయశాఖ కమీషనర్ వార్ల ఉత్తర్వుల మేరకు ఆలయ వైదిక కమిటీ సభ్యుల వారి సూచనల మేరకు లోకకళ్యాణార్థం సంకల్పించి ది.02-03-2023 నుండి 06-03-2023 వరకు 5 రోజులపాటు దేవస్థానం నందు జరుగు “శత చండీ సహిత మహారుద్రయాగం” లో భాగముగా ఈరోజు(మూడవ రోజు) అనగా ఉదయం 08.00 గం.లకు రుద్ర హవనము, చండీ హోమం, మూల మంత్ర హవనములు, నిత్యార్చన, నీరాజనం, మంత్రపుష్పము, ప్రసాద వితరణ జరుపబడినవి. అనంతరం మరలా మ.02 గం.ల నుండి సా.05.30 గం.ల వరకు రుద్ర హవనము, చండీ హోమం, మూల మంత్ర హవనములు, తదుపరి మంటప పూజలు జరిపి సా.06.30 గం.ల నుండి నీరాజనం, మంత్రపుష్పము, ప్రసాద వితరణ నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమం నందు గౌరవ ముఖ్యమంత్రివర్యుల కార్యదర్శి శ్రీ రేవు ముత్యాలరాజు దంపతులు, ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, బుద్దా రాంబాబు, బచ్చు మాధవీక్రిష్ణ, మారం వెంకటేశ్వర రావు గార్లు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు, వైదిక సిబ్బంది కోటా ప్రసాద్ గారు, వేదపండితులు చింతపల్లి ఆంజనేయ ఘనపాటి గారు మరియు ఇతర వేదపండితులు, ఋత్వికులు, అర్చకులు పాల్గొన్నారు. దేవస్థానమునకు విచ్చేసిన భక్తులందరూ ఈ యాగ కార్యక్రమములను ఆద్యంతం వీక్షించి తీర్థ ప్రసాదములను స్వీకరించారు.
addComments
Post a Comment