ప్రశాంతంగా ముగిసిన ఎం.ఎల్.సిల ఎన్నికలు.



*ప్రశాంతంగా ముగిసిన ఎం.ఎల్.సిల ఎన్నికలు*


*పట్టభద్రుల ఎం.ఎల్.సికి 71.60 శాతం పోలింగ్*


*స్థానిక సంస్థల ఎం.ఎల్.సికి 96.91 శాతం నమోదు*


శ్రీకాకుళం, మార్చి 13 (ప్రజా అమరావతి): జిల్లాలో జరిగిన పట్టభద్రుల మరియు స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ నేతృత్వంలో స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల పరిశీలకులు హెచ్.అరుణ్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారి బి.శాంతి విస్తృతంగా పర్యవేక్షణ చేయగా, సెక్టార్ అధికారులు తమ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. కాగా సోమవారం ఉదయం నుండి

కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల పరిస్థితిని జాయింట్ కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించి, పోలింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు తగు సూచనలు, సలహాలు అందచేశారు. 


పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 52,256 మంది ఓటర్లు ఉండగా, ఇందుకోసం 59 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసేసమయానికి పలాస డివిజను పరిధిలో 11,522 మంది ఓటర్లకు గాను 8,560 మంది ఓటుహక్కును వినియోగించుకోగా 74.29 శాతం పోలింగ్ నమోదైంది.  శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 29,631 మంది ఓటర్లకు గాను 20,788 మంది ఓటుహక్కును వినియోగించుకోగా 70.16 శాతం పోలింగ్ నమోదైంది. టెక్కలి డివిజనులో 11,103 మంది ఓటర్లకు గాను 8,069 మంది ఓటుహక్కును వినియోగించుకోగా 72.67 శాతం పోలింగ్ నమోదు అయింది. జిల్లావ్యాప్తంగా 37,417 మంది ఓటర్లు ఓటును వేయగా 71.60 శాతం పోలింగ్ నమోదు అయింది.


స్థానిక సంస్థలు శాసన మండలి ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 776 మంది ఓటర్లు ఉండగా  శ్రీకాకుళం డివిజనులో 249 మంది ఓటర్లకు గాను  ఉదయం 10.00గం.లకు 12.85 శాతం, మధ్యాహ్నం 12.00గం.లకు 71.08 శాతం, 02.00గం.లకు 84.74 శాతం, 04.00గం.లకు 93.57 శాతం నమోదైంది. పాలకొండ డివిజనులో 153 మంది ఓటర్లకు గాను ఉదయం 10.00గం.లకు 23.53 శాతం, మధ్యాహ్నం 12.00గం.లకు 73.86 శాతం, 02.00గం.లకు 91.50 శాతం, 04.00గం.లకు 97.39 శాతం నమోదైంది. టెక్కలి డివిజనులో 162 మంది ఓటర్లకు గాను ఉదయం 10.00గం.లకు 1.23 శాతం, మధ్యాహ్నం 12.00గం.లకు 39.51 శాతం, 02.00గం.లకు 90.12 శాతం, 04.00గం.లకు 99.38 శాతం నమోదైంది. పలాస డివిజనులో 212 మంది ఓటర్లకు గాను ఉదయం 10.00గం.లకు 20.75 శాతం, మధ్యాహ్నం 12.00గం.లకు 87.26 శాతం, 02.00గం.లకు 97.17 శాతం, 04.00గం.లకు 98.58 శాతం నమోదుతో జిల్లావ్యాప్తంగా 96.91 శాతం పోలింగ్ నమోదైంది.


జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలతో పాటు పటిష్ట బందోబస్తును కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయడంతో వివిధ వర్గాల పట్టభద్రులు, స్థానిక సంస్థలు తమ ఓటు హక్కును వినియోగించు కోవడంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాటుచేశారు.

Comments