టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే రావి దిగ్భ్రాంతి

 - టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే రావి దిగ్భ్రాంతి




 గుడివాడ మార్చి 2 (ప్రజా అమరావతి): టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతి పట్ల కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గురువారం గుడివాడలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఆవిర్భావం నుండి తుది శ్వాస విడిచే వరకు బచ్చుల తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారని తెలిపారు. బలహీన వర్గాలకు నాయకత్వం వహిస్తూ పార్టీలో అంచలంచెలుగా ఎదిగి ఎన్నో పదవులను చేపట్టారన్నారు. గత ఐదేళ్లుగా ఎమ్మెల్సీగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బచ్చుల ఎమ్మెల్సీ పదవీకాలం ఈనెల 25వ తేదీతో ముగియనుందని తెలిపారు. గత మూడేళ్లుగా గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా కూడా కొనసాగుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో గత నెల రోజుల కిందట దురదృష్టవశాత్తు గుండెపోటుకు గురయ్యారన్నారు.  అప్పటినుండి చికిత్స పొందుతూ బచ్చుల తుది శ్వాస విడవడం బాధాకరమన్నారు. బచ్చుల లేని లోటు తెలుగుదేశం పార్టీకి తీరనిదని అభిప్రాయపడ్డారు. బచ్చుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. బచ్చుల కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే రావి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Comments