జగన్ వచ్చాక పవర్, క్రాప్, ఆక్వా హాలిడే వచ్చింది. ఉపాధిహామీపై కేంద్రంతో మాట్లాడి వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం.

 అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గం, వాయల్పాడు మండలం, వాండ్లపల్లిలో రైతులతో యువనేత నారా లోకేష్ సమావేశం

పీలేరు (ప్రజా అమరావతి);

రైతుల ఆవేద‌న ఇది..

టమోటా రైతుల దగ్గర నుండి 100 బాక్సుల్లో 20 బాక్సులు జాక్ పాట్ తీస్తున్నారు. 

ఒక్క రైతు భరోసా ఇచ్చి సబ్సిడీలన్నీ రద్దు చేశారు. 

2019 వరకు వరికి ఎక‌రాకి రూ.10 వేలే పెట్టుబడి..ఇప్పుడు రూ.30 వేలు ఉంది. 

యూరియా తప్ప ఆర్బీకేలో ఏమీ ఉండటం లేదు.

అది ఇవ్వడానికి కూడా ఏ పార్టీ అని అడుగుతున్నారు.

పశువుల దాణా, గ్రాసానికి సబ్సిడీ రద్దు చేశారు.

గత ప్రభుత్వంలో తవ్విన ఇంకుడు గుంతలకు బిల్లులు మార్చుకుంటున్నారు.


సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ...

మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాడుగా మారబోతోంది. నీరు అందక ఎంతో లోతు బోరు తవ్వాల్సి ఉంటుంది. రైతుకు ఒక బోరు మాత్రమే ఉండాలని జగన్ అంటాడు.

టమోటా రైతులకు గిట్టుబాటు ధర లేదు. రోజుకో విధంగా టమోటా ధర మారుతోంది. 

టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు తెస్తానని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పటికీ హామీ నెరవేర్చలేదు. టమోటాలు పోయాల్సింది రోడ్ల మీద కాదు..తాడేపల్లి కొంప ముందు. 

డ్రిప్ ఇరిగేషన్ కు చంద్రబాబు 90 శాతం సబ్సిడీ ఇస్తే ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదు. ఎరువుల ధరలు, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగాయి. 

ఇప్పుడున్న వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఒక కోర్టు దొంగ. మంత్రయ్యాక రైతులను పట్టించుకున్నాడా.? 

జగన్ వచ్చాక పవర్, క్రాప్, ఆక్వా హాలిడే వచ్చింది. ఉపాధిహామీపై కేంద్రంతో మాట్లాడి వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం.


అదనపు అప్పు కోసమే మోటార్లకు మీటర్లు బిగిస్తున్నాడు. ఒక్కసారి మీటరు బిగిస్తే తొలగించడం అసాధ్యం. 

సర్వీస్ కట్ చేస్తే ఉద్యమిద్దాం..ఉచిత విద్యుత్ మీ హక్కు. ఇది ఒక్క రైతు సమస్యకాదు. 

మీటర్ల విషయంలో వైసీపీకి చెందిన రైతులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తారు.  

రైతులకు పార్టీలుండవు. రాయలసీమకు టీడీపీ హయాంలో రూ.13 వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఇరిగేషన్ కు ఈ సీఎం పెట్టిన ఖర్చు వెయ్యి కోట్లే. 

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతు తలసరి అప్పు రూ.75 వేలు..ఇప్పుడు రూ.2.50 లక్షలు ఉంది. 

ఇలా అయితే రైతులు ఏం వ్యవసాయం చేస్తారు.? 

నేను 26 రైతు భరోసా కేంద్రాలు చూశా...ఎప్పుడు చూసినా తాళాలు వేసి ఉంటున్నాయి. 

కేంద్రం ఇచ్చే వాటితో కలిపి ఒక్కో రైతుకి రైతు భరోసా కింద 18,500 రావాలి..కానీ జగన్ రూ.13,500 మాత్రమే ఇస్తున్నాడు. 

రైతులకు రూ.25 వేలు బాకీ పడ్డాడు. రూ.50 వేలకు లోపు ఉన్నవాళ్లకు చంద్రబాబు ఒకేసారి రుణమాఫీ చేశారు. చీనీ చెట్లకు కూడా ట్యాంకర్ల ద్వారా నీరు అందించి ఆదుకున్నాం. 

టీడీపీ వచ్చిన వంద రోజుల్లో జాక్ పాట్ విధానం రద్దు చేస్తాం. 

జగన్ రెడ్డి అమూల్ తెచ్చారు..కానీ అది పుంగనూరులో ఉండదు. తక్కువ ధరకు పాలు కొంటున్నాడు. రూ.50 కోట్లను పాడి రైతుల నుండి దోచుకుంటున్నాడు. 

గతంలో గోపాలమిత్రలను ఏర్పాటు చేశాం..ఒక్క ఫోన్ కొట్టగానే వాళ్లు ఇంటికి వచ్చి సమస్య పరిష్కరించేవాళ్లు. 

గోపాలమిత్ర వ్యవస్థను ఈ సీఎం రద్దు చేశారు. షెడ్ల డబ్బులు మేము రాగానే వడ్డీతో సహా ఇస్తాం.

Comments