ఆయుష్మాన్ భారత్ లో సేవల విస్తరణ
అధికారులకు శిక్షణా కార్యక్రమం
మానసిక ఆరోగ్య సేవలు, అత్యవసర ఆరోగ్య సేవలతోపాటు అన్ని రకాల సేవల విస్తరణ
గ్రామీణ, గిరిజన మారుమూల ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలందించటమే లక్ష్యం
డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లనిక్స్ లో మందుల లభ్యత పెంపు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, (గుంటూరు జిల్లా) (ప్రజా అమరావతి): ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు వీలుగా
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో సేవలను మరింత విస్తరిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి క్రిష్ణబాబు చెప్పారు. కన్ను, చెవి, ముక్కు, గొంతు, -మానసిక ఆరోగ్య సేవలు, అత్యవసర ఆరోగ్య సేవలు, వృద్ధులకు ఆరోగ్య సేవలు, ఉపశమన సంరక్షణ, గర్భిణీ స్త్రీల కు ఆరోగ్య సేవలు, రక్త హీనత మొదలగు ఆరోగ్య సేవల విస్తరణపై రాష్ట్రం లోని ఒకొక్క జిల్లా నుంచి నలుగురు వైద్యాధికారుల వంతున పాల్గొంటున్న ఆరు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని క్రిష్ణబాబు సోమవారం నాడు సందర్శించారు. ది.9.3.2023 నుండి ఆచార్య నాగార్జునా యూనివర్శిటీలో నిర్వహిస్తున్న ఈ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణా కార్యక్రమము 14.3.2023 మంగళవారంతో ముగియనున్నది. సోమవారం నాడు ఈ కార్యక్రమును సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యం. టి. కృష్ణ బాబు, IAS., ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జె. నివాస్, IAS. వైద్యాధికారులకు ఈ ట్రైనింగ్ యొక్క ప్రాముఖ్యత ను తెలియ చేసినారు. ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్ నందు 10032 డా . YSR విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేసి ప్రతి యొక్క క్లినిక్ లో సుశిక్షుతులైన యం. ఎల్. హెచ్. పి. లను నియమించడం జరిగినది అని మరియు వారి ద్వారా గ్రామీణ, గిరిజన మారుమూల ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలందించుటకు గాను సమగ్ర ఆరోగ్య కార్య క్రమాల పై యం. ఎల్. హెచ్. పి. లకు, స్టాఫ్ నర్స్ లకు, ఏ. ఎన్. యం లకు శిక్షణ నిచ్చేందుకు సమగ్ర కార్యాచరణ ను రూపొందించామని క్రిష్ణబాబు వివరించారు. ఈ శిక్షణ పొందటం ద్వారా ఫ్యామిలీ డాక్టరు విధానము లో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి ఉపయోగ కరము గా వుంటుందని తెలియ చేశారు. పాలియేటివ్ కేర్, ఆకస్మిక గుండెపోటు, ప్రమాదాల వంటి వాటితో పాటు ఆకస్మికంగా ముంచుకువచ్చే ఇతర ముప్పులను ఎదుర్కొనేందుకు అవసరమైన అంశాలను కూడా ఈ శిక్షణలో అందిస్తున్నామని చెప్పారు. అంతే కాకుండా ప్రతి ఒక్క క్లినిక్ నందు ఇప్పటికే 64 రకాల మందులను, 14 రకాల వైద్య పరీక్షలను అందుబాటులో వుంచామని, ఈ నెల చివరి నాటికి మొత్తం 105 రకాల మందులను, 14 రకాలకు అదనంగా మరికొన్ని రకా ల్యాబ్ పరీక్షలను అందుబాటు లో తెస్తామని అని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జె. నివాస్. తెలియ చేశారు. కిశోర బాలికలలో రక్త హీనత ను గుర్తించి వారికి రక్త హీనత నివారణ చేయడం, గర్భిణీ స్త్రీలలో పోషకాహార, ఆరోగ్య లోపాలను గుర్తించి వారికి సరైన వైద్యసేవలను అందిస్తామన్నారు. పై సమగ్ర ఆరోగ్య సేవలను అందించు టకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర బడ్జెట్ లో 7.3% ఖర్చు పెడుతోందని ఆయన చెప్పారు. ఈ సేవలన్ని 100 శాతం ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలని తెలిపినారు. ఈ కార్యక్రమము లో డెప్యూటీ డైరెక్టరు, రాష్ట్ర నోడల్ అధికారి శ్రీమతి కె. శ్యామల, మరియు ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వై. సుబ్రమణ్యం, మాస్టర్ ట్రైనర్లు, వివిధ జిల్లాల వైద్యాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment