బాలల సంరక్షణ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయి లో కల్పించాలి .... కేసలి అప్పారావు.

 బాలల సంరక్షణ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయి లో కల్పించాలి

.... కేసలి అప్పారావు.


                  

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని బాలలు తో పనిచేస్తున్న శిశు సంరక్షణ కేంద్రాల్లో మౌలిక  సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు తెలిపారు.ఈ రోజు సహచర కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి తో కలిసి విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో గల నవజీవన్ బాల భవన్ ను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించడం జరిగింది.

      ఆ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ   బాలల పట్ల సిబ్బంది మరియు నిర్వాహకులు స్నేహపూర్వక వాతావరణం తో ఉండాలని ,సకల సదుపాయాలు అనగా  సమతుల్య ఆహారం,విద్యుత్, వెలుతురు,త్రాగు నీరు, మరుగుదొడ్లు,రక్షణ ,సంరక్షణ  కల్పించాలని సూచించారు.   నిర్వాహకులు తో మాట్లాడుతూ హోం లో ఉంటున్న పిల్లలకు తరుచుగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, తల్లి దండ్రులును,కుటుంబ సభ్యులు ను  గుర్తించి తక్షణమే వారి దగ్గరకు చేర్పించాలని, ఒక వేళ అనాద పిల్లలు ఉంటే సరైన సంరక్షణ కేంద్రంలో చేర్పించాలని తెలిపారు.అనాధ, నిరాశ్రయ పిల్లలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆధరణిగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రతినిధి రమా పాల్గొన్నారు.

Comments